Free Bus Travel Scheme: స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Aug 15 , 2025 | 03:31 PM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న'స్త్రీ శక్తి' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఉండవల్లి గుహల నుంచి బస్సులో ప్రయాణిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించారు.
అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న'స్త్రీ శక్తి' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించారు. వీరంతా ఉండవల్లి సెంటర్, తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి సెంటర్, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ బస్సులో ప్రయాణించారు. బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించినంత సేపు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.
కాగా, విజయవాడ బస్ స్టేషన్‌లో జెండా ఊపి లాంఛనంగా ఉచిత బస్సులను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు విజయవాడ సిటీ బస్ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు, టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా, మహిళలు 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది చంద్రబాబు సర్కార్. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు. అలాగే సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి కండక్టర్ జారీ చేసే జీరో ఫేర్ టికెట్‌తో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
'స్త్రీ శక్తి' పథకం ద్వారా ఏకంగా 2.62కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్‌జెండర్లకు సైతం వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ పథకం అమలుతో ఏపీ ప్రభుత్వంపై ఏటా రూ.1,942 కోట్ల అదనపు భారం పడనుంది. అయినా పట్టుదలతో దీన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఈ పథకం ప్రవేశపెట్టడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు ఏపీ వ్యాప్తంగా మహిళలు నీరాజనాలు పడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Naidu On Banakacharla: బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!