Share News

Viral Makeup Video: వామ్మో.. ఇంతలా మోసం చేస్తారా? మేకప్‌నకు ముందు ఈమెను చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Aug 15 , 2025 | 02:24 PM

ప్రస్తుతం సహజ సౌందర్యానికి విలువ లేదు. అసలు రంగును దాచి పెట్టి కృత్రిమ సొబగులు అద్దుకుంటేనే అందంగా ఉన్నట్టు లెక్క. దీంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మేకప్‌‌తో మెరవడానికే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.

Viral Makeup Video: వామ్మో.. ఇంతలా మోసం చేస్తారా? మేకప్‌నకు ముందు ఈమెను చూస్తే షాకవ్వాల్సిందే..
Viral Makeup Video

ప్రస్తుతం సహజ సౌందర్యానికి విలువ లేదు. అసలు రంగును దాచి పెట్టి కృత్రిమ సొబగులు అద్దుకుంటేనే అందంగా ఉన్నట్టు లెక్క. దీంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మేకప్‌ (Makeup)తో మెరవడానికే ఇష్టపడుతున్నారు. కాస్త నల్లగా ఉన్న వారు ఆత్మన్యూనతకు గురవుతూ ఏ స్థాయిలో మేకప్‌పై మోజు పెంచుకుంటున్నారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో వైరల్ (Viral Video) అవుతోంది.


@JatSaroj6828 అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వివాహానికి ముందు ఓ యువతి మేకప్ వేసుకున్న తీరు షాక్‌కు గురి చేస్తోంది. నల్లగా ఉన్న యువతికి భారీ స్థాయిలో మేకప్ వేశారు. దీంతో మేకప్‌నకు ముందు, తర్వాత ఆమెను చూస్తే షాకవ్వాల్సిందే. ఆ వీడియోలోని రెండు మొహాలు ఒకరివే అంటే ఎవరూ నమ్మలేరు. ఆ మేకప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వ్యక్తి.. 'ఇది వరుడిని మోసగించడమే' అని సరదాగా కామెంట్ చేశారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారంది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఓ దేవుడా.. అబ్బాయిలను ఇంతలా మోసం చేస్తారా అని ఒక వ్యక్తి ప్రశ్నించారు. రోజూ అలాంటి మేకప్ వేసుకోవడం కుదురుతుందా అని మరొకరు కామెంట్ చేశారు. పార్లర్ జనాలకు దేవుడంటే భయం లేదా అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఇతను మామూలు దొంగ కాదు.. తాళం కప్పను విడగొట్టడానికి ఎలాంటి ట్రిక్ వాడాడో చూడండి..

ఇన్ని తెలివితేటలు ఎక్కడివి స్వామి.. పాత బల్బును ఎలా మార్చేశారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 15 , 2025 | 02:24 PM