CM Revanth On Banakacharla: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 10:52 AM
CM Revanth: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటాం అని అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 15: బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటాం అని అన్నారు. మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామని అన్నారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు.
కాళేశ్వరం కూలిపోయింది..
గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని సీఎం అన్నారు. SLBC, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని చెప్పారు. తెలంగాణలో చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం అని హామీ ఇచ్చారు. హైదరాబాద్ బ్రాండింగ్ పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. యువతను డ్రగ్స్‌కు బానిస చేసే కుట్రలు ఛేదించామని... 20 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మూసీ పునరుజ్జీవంతోనే హైదరాబాద్ వరదకు పరిష్కారం అని అన్నారు. త్వరలో వరంగల్, ఆదిలాబాద్‌కు కొత్త ఎయిర్‌పోర్టులు వస్తున్నాయని చెప్పారు. త్వరలోనే గ్రూప్-1, 2, 3 నియామకాలు పూర్తి చేస్తామన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ DNAలోనే ఉందని అన్నారు
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!