-
-
Home » Mukhyaamshalu » Breaking News Live Updates Wednesday 18th June 2025 Top news and Major Events Across India Siva
-
Breaking: మొదలైన.. ఆపరేషన్ సిందు..
ABN , First Publish Date - Jun 18 , 2025 | 01:43 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jun 18, 2025 22:00 IST
ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది.
దీనికి 'ఆపరేషన్ సింధు' అనే నామకరణం చేశారు.
అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులను భారత్‌కు తీసుకువస్తున్నారు.
ఈ విమానం గురువారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంటుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
-
Jun 18, 2025 21:15 IST
లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రిమాండ్
వెంకటేష్ నాయుడుకి కూడా రిమాండ్ విధించిన న్యాయస్థానం
జులై 1వ తేదీ వరకు రిమాండ్ వేసిన ఎసిబి కోర్టు
-
Jun 18, 2025 19:36 IST
ఫాస్టాగ్ ఆఫర్‌పై మరో బిగ్ అప్‌డేట్..
ఢిల్లీ: ఫాస్టాగ్ టోల్ ఏడాది రుసుంపై గెజిట్ విడుదల చేసిన కేంద్రం.
రూ.3 వేలతో ఏడాది అంతా తిరిగేలా లేదా 200 సార్లు టోల్ గేట్ క్రాస్ అయ్యేలా మార్పులు.
జాతీయ రహదారి ఫీ చట్టం 2008 ప్రకారం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నామన్న కేంద్రం.
కొత్త విధానం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రకటన.
ఏడాదికి ఒకసారి విధానం ఎంచుకున్న వారు ప్రతి ఏటా ఏప్రిల్ 1న రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మేరకు అధికారికంగా గెజిట్ విడుదల చేసిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.
రూ. 3 వేలతో ఫాస్ట్ టాగ్ తీసుకుంటే ఏడాది వరకు వాడుకోవచ్చు.
ఏడాది టైమ్ పరిమితి లేదా 200 సార్లు టోల్ గేట్ క్రాస్ చేయడం.. ఏదీ ముందు అయితే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారని గెజిట్‌లో స్పష్టం చేసిన కేంద్రం.
-
Jun 18, 2025 16:43 IST
హైదరాబాద్: సచివాలయంలో అఖిలపక్ష ఎంపీల సమావేశం ప్రారంభం.
గోదావరి-బనకచర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్.
హాజరైన ఎంపీలు ఒవైసీ, బలరాంనాయక్, మల్లు రవి తదితరులు.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్.
ముఖ్య అతిథిగా పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి.
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించిన ఉత్తమ్.
-
Jun 18, 2025 16:09 IST
అంబటికి డీఎస్పీ సీరియస్ వార్నింగ్..
పల్నాడు: అంబటి రాంబాబుకు నరసరావుపేట డిఎస్పీ సీరియస్ వార్నింగ్
బారికేడ్‌లు తొలగింపుపై డిఎస్పీ మండిపాటు.
ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరిక.
పిచ్చి వేశాలు వేస్తే అరెస్ట్ చేస్తానని హెచ్చరిక.
అంబటిపై చర్యలు తీసుకుంటామన్న డిఎస్పీ నాగేశ్వరరావు.
-
Jun 18, 2025 16:00 IST
పల్నాడు: జగన్ పర్యటనలో మరో వ్యక్తి మృతి.
సత్తెనపల్లి గడియార స్తంభం వద్ద సొమ్మసిల్లి పడిపోయిన కార్యకర్త.
ఆసుపత్రికి తరలించేలోపు వ్యక్తి మృతి.
మృతుడు సత్తెనపల్లికి చెందిన జయవర్దన్ రెడ్డి గా గుర్తింపు.
సత్తెనపల్లిలో ఆటోమోబల్ షాపు నిర్వాహకుడుగా ఉన్న జయవర్దన్ రెడ్డి.
క్లాక్ టవర్ వద్ద జగన్ రెడ్డి రాకతో వత్తడిలో ఊపిరి ఆడక పడిపోయిన జయ వర్దన్ రెడ్డి.
-
Jun 18, 2025 15:58 IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ
కూటమి పాలన విజయాలు సహా పలు అంశాలపై చర్చ.
ఏపీలో అభివృద్ధి పనుల పురోగతిపై అమిత్ షా, లోకేష్ చర్చ.
కొత్త ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని కోరిన లోకేష్.
యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందించిన మంత్రి లోకేష్.
ప్రజల్లో చైతన్యం నింపిన లోకేష్‌ను అభినందించిన అమిత్ షా.
చంద్రబాబు పాలనా అనుభవంతో అభివృద్ధి బాటలో ఏపీ: అమిత్ షా.
ఏపీ సర్కార్‌కు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా.
-
Jun 18, 2025 13:49 IST
బిగ్ ట్విస్ట్.. సంచలన విషయాలు బయట పెట్టిన షర్మిల..
కేసీఆర్, జగన్ చాలా సన్నిహితంగా ఉండేవారు: వైఎస్ షర్మిల
వాళ్ల సంబంధం ఎదుట రక్త సంబంధం కూడా చిన్నబోయింది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికీ నిజం.
కేసీఆర్, జగన్ జాయింట్ ఆపరేషనే ఫోన్ ట్యాపింగ్.
నా ఫోన్, నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు.
ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి నాతో చెప్పారు.
ఫోన్ సంభాషణలు వైవీ సుబ్బారెడ్డే నాకు వినిపించారు.
గతంలో ఈ విషయం ఎవరికీ చెప్పలేకపోయా.
నా రాజకీయ భవిష్యత్ నాశనం చేసేందుకే ఫోన్ ట్యాపింగ్.
నాకు అండగా నిలబడిన వారినీ బెదిరించారు.
నేను ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా చేశారు.
అప్పుడు చేయలేని పోరాటం.. ఇప్పుడు చేయడానికి సిద్ధం.
ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా.
ఫోన్ ట్యాపింగ్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి.
-
Jun 18, 2025 13:43 IST
మరో కుట్రకు తెరలేపిన వైసీపీ మూకలు..!
సోషల్ మీడియాలో కొడాలి నాని వార్తలపై ఏపీ పోలీసుల దర్యాప్తు
కోల్‌కతా ఎయిర్‌పోర్టులో కొడాలిని అధికారులు అడ్డుకున్నారంటూ వార్తలు
కొడాలి కొలంబో వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసినట్లు వార్తలు
సోషల్ మీడియాలో కొడాలి నాని వీడియోలు పోస్టు చేసిన పలువురు
వార్తలు వైరల్ వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు
ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే వార్తలు సృష్టించారని భావిస్తున్న పోలీసులు
కోల్‌కతా ఎయిర్‌పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులతో మాట్లాడిన పోలీసులు
కొడాలి నాని హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ధ్రువీకరించిన పోలీసులు