Share News

Pahalgam Terror Attack: పహల్గాం దాడిపై ఐక్యరాజ్యసమితి సూటి ప్రశ్న.. నీళ్లు నమిలిన దాయాది దేశం..

ABN , Publish Date - May 06 , 2025 | 08:21 PM

UNSC Meeting On Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడికి మాకెలాంటి సంబంధం లేదు. మేమూ ఉగ్రవాద బాధితులమే.. దీని వెనక భారత్ హస్తమే ఉందేమో అని బొంకుతున్న దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. పహల్గాం దాడిపై నిర్వహించిన రహస్య సమావేశంలో లష్కరే తోయిబాకు, మీ దేశానికి ఉన్న లింకేంటని సూటిగా ప్రశ్నించింది. దీంతో పాక్ ఏమన్నదంటే..

Pahalgam Terror Attack: పహల్గాం దాడిపై ఐక్యరాజ్యసమితి సూటి ప్రశ్న.. నీళ్లు నమిలిన దాయాది దేశం..
UNSC Emergency Meeting On Pahalgam Terror Attack

UNSC Emergency Meeting On Pahalgam Terror Attack: ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఏ క్షణానైనా యుద్ధం రావచ్చని.. మాపై దాడి చేస్తే అణు ప్రయోగం చేస్తామని పాక్ నేతలు పదే పదే బెదిరిస్తూ వస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) రహస్య సమావేశం నిర్వహించింది. 10 మంది తాత్కాలిక సభ్యులు, 5 మంది శాశ్వత సభ్యులు సహా 15 మంది UNSC సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో పాకిస్థాన్ కు ఐక్యరాజ్యసమితి అనేక కఠినమైన ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.


UNSC సమావేశం

పాకిస్థాన్ అభ్యర్థన మేరకు మే నెలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షుడైన గ్రీస్ సోమవారం సమావేశాన్ని షెడ్యూల్ చేశారు. పాకిస్థాన్ ప్రస్తుతం భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం కాదు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన సమావేశంలో అణ్వాయుధ పొరుగుదేశాల మధ్య పరిస్థితిపై చర్చలు జరిపింది.


దాడిపై పాకిస్థాన్ వివరణ ఇవ్వాలి..

అంతర్జాతీయ నివేదికల ప్రకారం, లష్కరే తోయిబా ఈ దాడిలో పాల్గొన్నదా అని UNSC పాకిస్థాన్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ అనధికారిక సమావేశంలో కౌన్సిల్ సభ్యులందరూ పాకిస్థాన్‌ను అనేక ప్రశ్నలు అడిగారు. ఉగ్రవాద దాడిని భారతదేశం చేసిందనే పాకిస్థాన్ వాదనను UNSC సభ్యులు తోసిపుచ్చారు. ఈ ఉగ్రవాద సంఘటనలో లష్కరే పాత్ర ఉందా లేదా అనే దానిపై కౌన్సిల్ పాకిస్థాన్ నుంచి వివరణ కోరినట్లు సమాచారం. భారతదేశం, పాకిస్థాన్ మధ్య నెలకొన్న సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఐరాస సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది.


Read Also: Bilaval Bhutto: నిన్న రక్తపాతం, నేడు శాంతి వచనాలు.. బిలావల్ భుట్టో తీరిది

Pakistan: రక్షణ రంగం బడ్జెట్ 18 శాతం పెంచిన పాక్

Ukraine Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ ఘోర దాడి..4 ఎయిర్ పోర్టులు పూర్తిగా మూసివేత..

Updated Date - May 06 , 2025 | 09:03 PM