Iran vs US: యుద్ధానికి సిద్ధమవండి.. ట్రంప్ వ్యాఖ్యలకు ఖమేనీ కౌంటర్..
ABN , Publish Date - Jun 18 , 2025 | 07:21 AM
Khamenei warns US: కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Iran Supreme Leader Khamenei) ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Khamenei fires back at Trump over US threats: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి (Ayatollah Ali Khamenei) బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేసిన తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఖమేనీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఉగ్రవాద జియోనిస్ట్ పాలనకు గట్టి సమాధానం చెప్తామని.. వారి పట్ల కనికరం చూపే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్‌తో కలిసి టెహ్రాన్ అణుకేంద్రాలపై దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి ఇప్పటికే హింట్ ఇచ్చారు.
జీ-7 సమావేశం నుంచి అర్ధంతరంగా వెనుదిరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ సెక్యూరిటీతో సమావేశమై ఇరాన్-ఇజ్రాయెల్ (Israel-Iran War) ఉద్రిక్తతలపై దాదాపు 80 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసని.. ఖమేనీని చంపే ఉద్దేశం లేదని.. తక్షణమే లొంగిపోవాలని హెచ్చరించారు. తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ పోస్ట్ చేసిన కాసేపటికే ఖమేనీ ఎక్స్ వేదికగా వరస పోస్టులు పెట్టాడు. ఉగ్రవాద జియోనిస్ట్ పాలనకు గట్టిగా బదులిస్తామని.. కనికరం చూపబోమని ఒక పోస్టులో వార్నింగ్ ఇచ్చాడు. బుధవారం తెల్లవారుజామున ఇరాన్ ఇజ్రాయెల్‌పై రెండు రౌండ్ల బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కొద్దిసేపటికే ఈ పోస్ట్ పెట్టడం గమనార్హం.
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం, మరో పోస్టులో పార్సీ భాషలో "యుద్ధం ప్రారంభమైంది" అని ఖమేనీ పోస్ట్ చేశాడు. దానితో పాటు ఖైబర్ చారిత్రాత్మక యుద్ధాన్ని సూచిస్తూ కోట ద్వారంలోకి కత్తితో ప్రవేశించే వ్యక్తి చిత్రం కూడా ఉంది. ఇదిలా ఉంటే ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ ఆరో రోజున కూడా భీకర పోరు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి