Share News

Iran-Israel conflict 2025: ట్రంప్ హెచ్చరిక తర్వాత రెచ్చిపోయిన ఇరాన్.. 10 చోట్ల హైపర్‌సోనిక్ దాడులు..

ABN , Publish Date - Jun 18 , 2025 | 09:54 AM

Iran vs Israel War latest update: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అన్నంత పని చేశాడు. కనికరం చూపనని ఖమేనీ ప్రకటించిన అనంతరం టెహ్రాన్ ఇజ్రాయెల్ లో 10 చోట్ల హైపర్ సోనిక్ క్షిపణులతో విరుచుకుపడింది.

Iran-Israel conflict 2025: ట్రంప్ హెచ్చరిక తర్వాత రెచ్చిపోయిన ఇరాన్.. 10 చోట్ల హైపర్‌సోనిక్ దాడులు..
Iran Unleashes Hypersonic Missile on Israel after Khamenei No Mercy Threat

Iran Launches Hypersonic Missile Targeting Israel: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బేషరతుగా లొంగిపోమని వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇరాన్ మరింత రెచ్చిపోయింది. సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ (Iran Supreme Leader Khamenei) అన్నంత పని చేశాడు. ట్రంప్ కఠిన హెచ్చరికల అనంతరం ఇరాన్ ఇజ్రాయెల్ లో 10 చోట్ల హైపర్ సోనిక్ క్షిపణులతో దాడులకు తెగబడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తాజా దాడిని ఒక ప్రకటనలో ధృవీకరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు (Iran-Israel Conflict) తారాస్థాయికి చేరాయి.


బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ లోని 10 లక్ష్యాలపై ఫతాహ్-1 హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) ధృవీకరించింది.'ఆపరేషన్ హానెస్ట్ ప్రామిస్ 3' లో 11వ దశ కొనసాగుతోంది ప్రభుత్వ టీవీ ఛానల్ ద్వారా వెల్లడించింది. ఆక్రమిత భూభాగాల గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ప్రకటించుకుంది. యుద్ధం మొదలైందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటన అనంతరం టెహ్రాన్ ఈ దాడులు నిర్వహించింది.


బుధవారం అర్థరాత్రి సుమారు 12.40 నిమిషాల స‌మ‌యంలో ఇజ్రాయిల్‌పై దాదాపు 15 ప్రొజెక్టైల్స్ ప్రయోగించింది ఇరాన్. 10 ప్రాంతాల్లో హైపర్ సోనిక్ క్షిపణులతో విరుచుకుపడటంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. సెంట్రల్ ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ శరణార్థి శిబిరాల్లో అలర్ట్ జారీ చేసింది. మిసైళ్ల దాడి జరుగుతున్నందున ప్రజలు తక్షణమే ఆయా ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని హెచ్చరించింది.


ఇరాన్ వద్ద ఉండే అత్యంత శక్తిమంతమైన ఆయుధాల్లో ఫతాహ్-1 హైపర్ సోనిక్ మిస్సైల్ ఒకటి. ధ్వని కంటే 15 రెట్లు వేగంగా దూసుకెళ్లే ఈ క్షిపణి అత్యంత ప్రమాదకరమైనది. 1400 కిలోమీట‌ర్ల దూరంలో లక్ష్యాలను కచ్చితంగా కేవలం 4 నిమిషాల్లోనే ఛేదించడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం వరసపెట్టి ఇజ్రాయెల్ పై ఈ మిస్సైళ్లను ప్రయోగిస్తుండటంతో ఇరు దేశాల మధ్య యుద్ధ జ్వాలలు మరింత ఎగసిపడ్డట్టయింది. ఇప్పటికే ఫతాహ్ టెల్ అవీవ్ ఐరన్ డోమ్ ను కాస్త దెబ్బతీసిందని తెలుస్తోంది. కాగా, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు ప్రణాళికలు రచిస్తోంది.


ఇరాన్ మీడియా ప్రకారం, ఇజ్రాయెల్ టెహ్రాన్ సమీపంలోని ఖోజిర్ క్షిపణి ఉత్పత్తి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ కేంద్రం ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి అత్యంత అవసరమైనది. 2024 లో కూడా ఇజ్రాయెల్ దీనిపై దాడి చేసింది.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలోకి అమెరికా

Iran vs US: యుద్ధానికి సిద్ధమవండి.. ట్రంప్ వ్యాఖ్యలకు ఖమేనీ కౌంటర్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 11:46 AM