Share News

Watermelons: జర.. చూసి తినండి..

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:41 AM

ప్రస్తుతం వేసవి సీజన్ వచ్చేసింది. నీటిశాతం అధికంగా ఉండే పుచ్చకాయలను అందరూ ఇష్టపడతారు. అయితే.. ఈ పుచ్చకాయలను చూసి తినకపోతే అనారోగ్యం తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలేంటో ఈ వార్తలో తెలుసుకుందాం పదండిమరి...

Watermelons: జర.. చూసి తినండి..
Watermelon

  • జోరుగా పుచ్చకాయల వ్యాపారం

  • రంగు కోసం రసాయనాలు

  • ఆవురావురుమని తింటే అనారోగ్యం తప్పదు అంటున్న నిపుణులు

హైదరాబాద్: నగరంలో పుచ్చకాయల(Watermelons) వ్యాపారం జోరుగా సాగుతోంది. శివరాత్రికి ముందే మార్కెట్‌కు చేరిన పుచ్చకాయలు నగర వాసుల నోరూరిస్తున్నాయి. ఎండలు ముదురుతుండడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. 5వేల సంవత్సరాల క్రితం ఈజిప్టులో పుచ్చకాయను పండించినట్లు ఆధారాలు ఉన్నప్పటికి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 96 దేశాల్లో వీటిని సాగుచేస్తున్నట్లు సమాచారం.

ఈ వార్తను కూడా చదవండి: Hotels: పురుగులు పట్టిన పిండి.. పాడైన టమోటాలు..


ఔషధ గుణాలివే..

వీటిలో 92 శాతం నీరు ఉంటుంది కాబట్టి దీనిని ఆరగించిన వెంటనే దాహార్తి తీరుతుంది. దీనిలో విటమిన్‌ ఏ, బి6, సీ విటమిన్లతో పాటు పీచు పదార్థం, పొటాషియం, అధిక మొత్తంలో ఉంటాయి. విటమిన్‌ ఏ కంటి ఆరోగ్యానికి అవసరం. విటమిన్‌ బి6 మెదడులో సెరటోనిన్‌, మెలటోనిన్‌, డోపమిన్‌ వంటి న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌ విడుదలవడానికి తోడ్పడుతుంది. అందుకే ఈ కాయను తిన్నప్పుడు చీకాకు తగ్గుతుంది. దీనిలోని ఎరుపు రంగుకు కారణమైన లైకోపీన్‌ అనే పదార్థం క్యాన్సర్‌, గుండెజబ్బులు రాకుండా నిరోధిస్తుంది. పుచ్చకాయలో అధిక మొత్తంలో ఉన్న పొటాషియం మూత్రంలో యూరిక్‌ ఆమ్లాన్ని తగ్గిస్తుంది. ఇది విరేచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలను నివారిస్తుంది.


ఎంతోమందికి జీవనోపాధి..

పుచ్చకాయ మన దేశంలో ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తోంది. శివరాత్రికి ముందు నుంచి దిగుబడి పెరగడంతో చిరు వ్యాపారులు వేసవికాలం ముగిసే వరకు ఈ వ్యాపారాన్నే జీవనోపాధిగా ఎంచుకుంటున్నారు. దీంతో జీడిమెట్ల, సూరారం కాలనీ, బాలానగర్‌, కేపీహెచ్‌బీకాలనీ, చింత్‌, భరత్‌నగర్‌ కాలనీ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో చిరు వ్యాపారులు పండ్లను రాసులుగా పోసి కిలో రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తుంటే, మరికొందరు వ్యాపారులు పుచ్చకాయ ముక్కలను ఐస్‌పై చేర్చి వాటికి ఉప్పు, మసాల పొడులను చేర్చి కేవలం రూ.20 నుంచి రూ.25 అందిస్తున్నారు.

Watermelons.jpg


100 గ్రాముల పుచ్చకాయ గుజ్జులో..

  • నీరు 95.2గ్రా, ప్రొటీన్‌ 0.3 గ్రా, కొవ్వు పదార్థాలు 0.2గ్రా, పీచు పదార్థాలు 0.4గ్రా

  • కెరోటిన్‌ 169 మైక్రోగ్రాములు, సి.విటమిన్‌ 26 మి.గ్రా, కాల్షియం 32 మి.గ్రా,

  • పాస్సరస్‌ 14 మి.గ్రా, ఇనుము 1.4 మి.గ్రా, సోడియం 104.6 మి.గ్రా

  • పొటాషియం 341 మి.గ్రా, శక్తి 17 కెలరీలు ఉన్నాయి.


వ్యాపారం అంతంత మాత్రమే..

ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండడంతో వ్యాపారం అంతగా సాగడం లేదు. ట్రేడర్ల వద్దనుంచి పండ్లు తెచ్చి విక్రయిస్తుంటే రోజుకు ఊహించినంతగా కొనుగోల్లు సాగడం లేదు. కిలో రూ.20 నుంచి 30రూపాయలకు విక్రయిస్తున్నప్పటికీ కొనుగోలు దారులు ఇంకా బేరం ఆడుతున్నారు.

- గణేష్‌, పండ్ల వ్యాపారి, కూకట్‌పల్లి


ఈ వార్తలను కూడా చదవండి:

తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 08 , 2025 | 11:49 AM