Share News

Hotels: పురుగులు పట్టిన పిండి.. పాడైన టమోటాలు..

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:06 AM

నగరంలోని కొన్ని భోజన హోటళ్లలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. పురుగులు పట్టిన పిండి.. పాడైన టమోటాలతో వంటలు చేస్తూ వాటినే ప్రజలకు విక్రయిస్తున్నారు. అవి తిన్నవారు అనారోగ్యానికి గురవుతూ ఆసుపత్రులపాలవుతున్నారు.

Hotels: పురుగులు పట్టిన పిండి.. పాడైన టమోటాలు..

- హోటళ్ల తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు

హైదరాబాద్: అధికారులు నిర్వహించిన హోటల్‌ తనిఖీల్లో పురుగులు పట్టిన బియ్యపు పిండి, పాడైన టమోటాలు, అపరిశుభ్ర వాతావరణం వెలుగు చూస్తున్నాయి. ఫుడ్‌ సెఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు(Food Safety Task Force officials) ఈ నెల 6న అమీర్‌పేటలోని తాజా కిచెన్‌, అమోఘా హోటల్‌ అండ్‌ కేఫ్‌లో తనిఖీలు చేశారు. తాజా కిచెన్‌(Kitchen)లో నీటి సంరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. ఫ్రిడ్జ్‌లో సగం ఉడికించిన ఆహార పదార్ధాలు, ఆహారానికి సంబంధం లేని పదార్థాలను ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా ఉంచినట్టు తేలింది.

ఈ వార్తను కూడా చదవండి: Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వం మహిళల కంట కన్నీరు పెట్టిస్తోంది..బండి సంజయ్ ఫైర్


బియ్యపు పిండిలో పురుగులు, పాడైన టమోటాలు, కొన్ని ఆహార పదార్థాల్లో వెంట్రుకలు ఉన్నట్టు గుర్తించారు. అమోఘా హోటల్‌లో కిచెన్‌లో ఫ్లోరింగ్‌ అపరిశుభ్ర, గ్రైండింగ్‌, వాషింగ్‌ ఏరియా పూర్తి చెత్తతో నిండిపోయి ఉండటం గమనించారు. సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ వాడుతున్నట్టు తేలింది. టాయిలెట్‌, కిచెన్‌తో అనుసంధానం చేసి ఉండటం వల్ల దుర్వాసన వ్యాప్తి చెందేలా ఉంది. దీంతో అధికారులు ఈ హోటళ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.


ఈ వార్తను కూడా చదవండి: తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ఈ వార్తను కూడా చదవండి: హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

ఈ వార్తను కూడా చదవండి: ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

ఈ వార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 08 , 2025 | 11:06 AM