Share News

Summer: వేసవిలో.. పిల్లలు జర జాగ్రత్త..

ABN , Publish Date - May 09 , 2025 | 11:47 AM

ప్రస్తుతం వేసవి సీజన్ వచ్చేసింది. పాఠశాలలకు సెలవులు ఇచ్చేశారు. అయితే.. ఇంటివద్ద ఉండే చిన్నారులు బయట ఎండలో ఆటలాడుతుంటారు. ఈ క్రమంలో వారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాగా.. వేసవిలో పిల్లలు అస్వస్థతకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీపుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Summer: వేసవిలో.. పిల్లలు జర జాగ్రత్త..

- ఉదయం పది తరువాత ఆటలు వద్దు

- తేలికపాటి ఆహారం, సరిపడా నీరు తీసుకోవాలి

హైదరాబాద్: రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనాలు విలవిల్లాడుతున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం.. వేడి గాలులు వీచడంతో చిన్నపిల్లలు త్వరగా అలసిపోవడం, వడదెబ్బకు లోనవడం వంటి సమస్య తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కువగా బయట ఆడుకోవడం లాంటివి చేస్తుంటారు. ఉదయం పది తర్వాత బయటకు పిల్లలను బయటకు పంపకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు తేలికపాటి ఆహారం అందిస్తూ సరిపడా నీరు తీసుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: శంషాబాద్‌ టు వియత్నాం.. విమాన సర్వీసును ప్రారంభించిన జీఎంఆర్‌


లేతరంగు వస్ర్తాలు ధరించాలి

ఎండలో తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే టోపి లేదా గొడుగు వాడాలి. శరీరం అంతా కప్పేలా గాలి, సోకేలా తెల్లటి నూలు వస్త్రాలు ధరించాలి. లేదా లైట్‌ కలర్‌ బట్టలు వేసుకోవడం ఎంతో ఉత్తమం. సన్‌లోషన్‌ క్రీములు వినియోగించాలి.

- మౌనిక, పీహెచ్‌సీ వైద్యాధికారి, మూసాపేట వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

- తప్పనిసరిగా రోజుకు రెండు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.

- సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి.


city8.2.jpg

- డీహ్రైడేషన్‌కు గురైనప్పుడు గ్లూకోజ్‌ తాగాలి.

- నీరసం. కళ్లు తిరగడం, వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

- చర్మవ్యాధలు వచ్చే అవకాశం ఉన్నందున కనీసం రోజుకు రెండు సార్లయిన స్నానం చేయాలి.

- పండ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, కర్బూజ, దోసకాయల వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

- కూల్‌డ్రింక్స్‌ అసలే తీసుకోవద్దు

- ఉదయం పది నుంచి సాయంత్రం 5 వరకు బయట తిరగకూడదు.


ఈ వార్తలు కూడా చదవండి

Breaking News: భారత్-పాక్ యుద్ధంపై చైనా తాజా రియాక్షన్ ఇదే..

ToDay Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

నవ్వించడమే సింగిల్‌ లక్ష్యం

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చనిపోయాడా ..?

Operation Sindoor: యుద్ధ బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - May 09 , 2025 | 11:47 AM