Share News

Bihar Elections: వేదికపై పొరపాటును సవరించిన మోదీ.. ఏంజరిగిందంటే

ABN , Publish Date - Oct 24 , 2025 | 09:50 PM

నితీష్ తరువాత మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతో జనం తమ మొబైల్స్‌ను క్లిక్‌మనిపించారు. వెంటనే మోదీ చిరునవ్వులు చిందిస్తూ... ఇంతగా వెలుగులు విరజిమ్ముతుంటే ఎవరికైనా లాంతర్లు (ఆర్జేడీ గుర్తు) అవసరమవుతాయా? అని ప్రశ్నించారు.

Bihar Elections: వేదికపై పొరపాటును సవరించిన మోదీ.. ఏంజరిగిందంటే
Bihar Assembly Elections

సమస్టిపూర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) ప్రచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధికారికంగా శుక్రవారంనాడు ప్రారంభించారు. కిక్కిరిసిన జనం హర్షధ్వానాల మధ్య సమస్టిపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి వేదికపైకి చేరుకున్నారు. ఈ సమయంలో అనౌన్సర్ చేసిన ఒక పొరపాటును మోదీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరిచేశారు.


నిజానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేదికపై ప్రసంగించాల్సి ఉండగా... అనౌన్సర్ మైక్రోఫోన్ తీసుకుని లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌‌ను ప్రసంగించాల్సిందిగా కోరారు. దీన్ని ప్రధాని వెంటనే గ్రహించి నితీష్‌ కుమార్ వైపు చూస్తూ సంకేతాలిచ్చారు. నితిష్ కుమార్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సీటు నుంచి లేచి సుమారు 10 నిమిషాల పాటు ప్రసంగించారు. చిరాగ్ తన సీటుకే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆయనను ఎవరూ పిలవలేదు. నితీష్ తరువాత మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతో జనం తమ మొబైల్స్‌ను క్లిక్‌మనిపించారు. వెంటనే మోదీ చిరునవ్వులు చిందిస్తూ... ఇంతగా వెలుగులు విరజిమ్ముతుంటే ఎవరికైనా లాంతర్లు (ఆర్జేడీ గుర్తు) అవసరమవుతాయా? అని ప్రశ్నించారు.


మొబైల్ కథ..

ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. 'కాంగ్రెస్ ఏళ్ల తరబడి పాలనలో చాలామందికి ఫోన్లు అందుబాటులో ఉండేవి కాదు. అది అత్యంత ఖరీదైన వ్యవహారంగా ఉండేది. దేశంలో రెండు ఫ్యాక్టరీలే వాటిని తయారు చేసేవి. ఇవాళ ఇండియాలోని 200కు పైగా ఫ్యాక్టరీల్లో ఫోన్లు తయారవుతున్నాయి. యువకులు వీడియోలు, కంటెంట్ క్రియేషన్‌తో సంపాదిస్తున్నారు. డాటా ధర కూడా దాదాపు పెద్దగా లేనట్టే. బిహార్ ఇప్పుడు సొంతంగా తమ భవిష్యత్తును గ్లోయింగ్ స్క్రీన్స్‌పై చూసుకుంటోందని అన్నారు. నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని తిరిగి గెలిపిస్తే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మరింత వేగవంతమవుతుందని హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు.. నేషనల్ కాన్ఫరెన్స్‌కు 3, బీజేపీకి 1

ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్‌తో 1500 కోట్ల నష్టం.. హైదరాబాద్‌లో భారీగా బాధితులు!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 24 , 2025 | 09:54 PM