Bihar Elections: 20 నెలల్లో నూతన బీహార్‌ను ఆవిష్కరిస్తాం.. తేజస్వి పిలుపు
ABN , Publish Date - Oct 26 , 2025 | 02:46 PM
మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తే బిహార్ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులకు అలవెన్సులు రెట్టింపు చేస్తామని, రూ.50 లక్షల బీమా, పెన్షన్ సదుపాయాలు కల్పిస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. కూటమి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సహానితో కిలిసి మీడియా సమావేశంలో తేజస్వి మాట్లాడారు.
పాట్నా: బిహార్ మార్పును కోరుకుంటోందని, ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై విసిగిపోయారని, మార్పును కోరుకుంటున్నారని ఆర్జేడీ నేత, విపక్ష 'మహాఘట్‌బంధన్' (Mahaghatbandhan) ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) అన్నారు. బిహార్ ప్రజలు బీజేపీకి 20 ఏళ్లు అవకాశం ఇచ్చారని, తాము కేవలం 20 నెలలు అడుగుతున్నామని, ఈసారి ప్రజలు మార్పును స్వాగతిస్తారనే నమ్మకం తనకు బలంగా ఉందని చెప్పారు. నూతన బీహార్ ఆవిష్కరణకు మహాఘట్‌బంధన్ కలిసికట్టుగా పనిచేస్తుందని భరోసా ఇచ్చారు.
పంచాయతీ రాజ్ ప్రతినిధులకు వరాలు
మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తే బిహార్ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులకు అలవెన్సులు రెట్టింపు చేస్తామని, రూ.50 లక్షల బీమా, పెన్షన్ సదుపాయాలు కల్పిస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. కూటమి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సహానితో కలిసి మీడియా సమావేశంలో తేజస్వి మాట్లాడారు. రాష్ట్రంలోని కుండల తయారీ కార్మికులు, బార్బర్లు, కార్పెంటర్లకు రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు అందిస్తామని వాగ్దానం చేశారు.
బిహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, తాము ఎక్కడికి వెళ్లినా కులమతాలకు అతీతంగా ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, ఈ ప్రభుత్వ హయంలో అవినీతి, నేరాలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు. బీజేపీ గురించి ప్రజలు బాగా అర్ధం చేసుకున్నారని అన్నారు. ప్రజలు తమకు అధికారమిస్తే కేవలం 20 నెలల్లో బిహార్‌లో సమూల మార్పులు తీసుకు వస్తామని తెలిపారు. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ యోధుడు.. మన్‌కీ బాత్‌లో 'కొమురం భీం'ని కీర్తించిన ప్రధాని నరేంద్రమోదీ
పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి