GST Reduction: జీఎస్టీ ఎఫెక్ట్ .. మార్కెట్ వెలవెల
ABN , Publish Date - Sep 14 , 2025 | 07:57 AM
మార్కెట్‌పై జీఎస్‌టీ తగ్గింపు ప్రభావం స్పష్టగా కనిపిస్తుంది. ఈనెల 22నుంచి పలు వస్తువులుపై జీఎస్టీ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని మార్కెట్‌లపై ప్రభావం పడింది.
వెంకట్ (పేరు మార్చడమైనది) అనే వ్యక్తి తన కారుకి నాలుగు టైర్లు మార్పించడానికి షోరూంకి వెళ్లాడు. రూ.32 వేలకు బేరం ఆడి టైర్లు తీసుకునే సమయంలో జీఎస్టీ ఎంత అని ప్రశ్నించాడు. షోరూం యజమాని తాము బిల్లులో వేసే జీఎస్టీ చూపించగా వెంటనే కొనుగోలు ఆపివేసి ఈనెల 22 తర్వాత వస్తానని తిరుగుముఖం పట్టాడు.
గోపాల్ అనే వ్యక్తి తాను ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న కారు తెచ్చుకోవడానికి షోరూంకి వెళ్లాడు. అక్కడ జీఎస్‌టీ తగ్గింపు (GST Reduction) ముందు రూ.16లక్షలు ఉన్న కారు రూ.14.5 లక్షలు ఇస్తామని షోరూం వాళ్లు చెప్పారు. అయితే ఈనెల 22 తరువాత మరింత రేటు తగ్గుతుందని కొనుగోలు వాయిదా వేశాడు.
ధరలు తగ్గుతాయని వేసి చూస్తున్న కొనుగోలుదారులు
జీఎస్టీ తగ్గింపు ప్రకటన ప్రభావం
ఎల్‌ఐసీ సంస్థదీ అదే పరిస్థితి
పాలకొల్లు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి) : మార్కెట్‌పై జీఎస్‌టీ తగ్గింపు (GST Reduction) ప్రభావం స్పష్టగా కనిపిస్తుంది. ఈనెల 22నుంచి పలు వస్తువులుపై జీఎస్టీ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని మార్కెట్‌లపై ప్రభావం పడింది. ఏసీలు, కూలర్లు టీవీలు ఫ్రిజ్‌లు మోటారుసైకిళ్లు, కార్లు అన్నిరకాల షోరూంలు గత పది రోజులుగా కోనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. పలు కార్లు కంపెనీలు మోటారు సైకిల్ కంపెనీలు ఇప్పటికే ధరలు తగ్గించాయి. ఈనెల 22 తర్వాత మరింతగా తగ్గే అవకాశం ఉంటుందని బావిస్తున్న కోనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. పట్టణాలలోని ప్రధాన మార్కెట్ కూడళ్లలో కళ తగ్గింది. షాపులలో కొనుగోలుదారులు లేక వారం పొడవునా వారాంతం సెలవుదినంగానే కనిపిస్తుంది.
పలు రకాలు ఉపకరణాలపై జీఎస్‌టీ ఎంత మేరకు తగ్గిస్తున్నదీ కేంద్రం స్పష్టంగా ప్రకటించినప్పటికీ ఆయా వస్తువులు కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు. ఈనెల 22 తర్వాతే కొనుగోలు చేస్తే మరింతగా తగ్గుతుందని ఆశిస్తూ వేచి చూస్తున్నారు.
ఎల్‌ఐసీ సంస్థ పరిస్థితి అంతే..
ఎల్‌ఐసీ పాత ప్రీమియం చెల్లింపు కొత్త పాలసీలు సేకరణ గత పది రోజులుగా మందకొడిగా ఉన్నట్టు ఎల్‌ఐసీ ఏజెంట్లు చెబుతున్నారు. ఎల్‌ఐసీ ప్రీమియంలపై జీఎస్‌టీ తగ్గింపు ఎలా ఉంటుందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు బీమారంగ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ఈనెల 22 తర్వాతే బీమా వ్యాపారం పుంజుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీలో అమానుషం.. బీ ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్య
ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు
Read Latest Andhra Pradesh News and National News