Share News

MP Kalisetti Wishes to ABN: జర్నలిజంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నూతన ఒరవడి సృష్టించింది: ఎంపీ కలిశెట్టి

ABN , Publish Date - Oct 15 , 2025 | 09:25 PM

తెలుగు టీవీ జర్నలిజంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నూతన ఒరవడి సృష్టించిందని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశంసించారు. దమ్మున్న, మనసున్న ఛానల్‌గా తెలుగు ప్రేక్షకుల మదిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిలిచిందని కొనియాడారు.

MP Kalisetti Wishes to ABN: జర్నలిజంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నూతన ఒరవడి సృష్టించింది: ఎంపీ కలిశెట్టి
MP Kalisetti Appalanaidu Wishes to ABN

విజయనగరం, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి): తెలుగు టీవీ జర్నలిజంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy) నూతన ఒరవడి సృష్టించిందని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (Telugu Desam Party Vizianagaram MP Kalisetti Appalanaidu) ప్రశంసించారు. దమ్మున్న, మనసున్న ఛానల్‌గా తెలుగు ప్రేక్షకుల మదిలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నిలిచిందని కొనియాడారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సారథ్యం తెలుగు జర్నలిజానికి స్ఫూర్తిదాయకమని ఉద్ఘాటించారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.


విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి 16వ వార్షికోత్సవ వేడుకలు ఇవాళ (బుధవారం) ఘనంగా జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో కేక్ కట్ చేసి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నగర టీడీపీ అధ్యక్షులు గంటా రవి, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ పైల మహేష్, మండల ప్రధాన కార్యదర్శి పాసీ అప్పలనాయుడు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి సోము మహేష్, తదితరులు పాల్గొన్నారు.


వైసీపీకి దడ మొదలైంది:ఎంపీ కలిశెట్టి

విశాఖపట్నానికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందని తెలిసిన దగ్గర నుంచి వైసీపీ నేతలకి దడ మొదలైందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. గూగుల్ రాకతో దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దార్శనికత, లోకేష్ కృషిని లోకమంతా కొనియాడుతోందని వ్యాఖ్యానించారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.


ఉత్తరాంధ్ర దశను, దిశను మార్చిన చంద్రబాబు, లోకేష్ రుణం తీర్చుకుంటామని నొక్కిచెప్పారు. ఏపీలో అభివృద్ధి జరుగుతున్న తరుణంలో వైసీపీ నేతల పిచ్చి మాటలు విని జాలిపడుతున్నామని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమం కోసం ఎంతగానో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 09:43 PM