Share News

World First Aid Day 2025: ప్రథమ చికిత్సతో ప్రాణాలకు రక్షణ

ABN , Publish Date - Sep 13 , 2025 | 09:35 AM

ప్రమాదం జరిగిన తరువాత నిపుణుల వైద్యం అందేలో గా ‘ప్రథమ చికిత్స’ చాలా కీలకం. అలా సరైన సమయం లో ప్రథమ చికిత్స అందక చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులోకి వచ్చాయి.

World First Aid Day 2025: ప్రథమ చికిత్సతో ప్రాణాలకు రక్షణ
World First Aid Day 2025

ప్రథమ స్పందనే కీలకం

అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్సతో మేలు

తొలి గంట సమయానికి అత్యంత ప్రాధాన్యం

ఆలోగా వైద్య సేవలందితే ప్రాణాలకు రక్షణ

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినం

రాజాం పట్టణానికి చెందిన శ్రీనివాసరావు, పద్మ దంపతులు టీవీ చూస్తున్నారు. ఆ సమయంలో కుమార్తె శ్రావ్య కూరగాయలు తురుముతున్న క్రమంలో చేతికి గాయమైంది. రక్తం కారుతుండడంతో తల్లిదండ్రులు కప్‌ బోర్డులో ఉన్న ప్రథమ చికిత్స (First Aid) పెట్టెను తీసుకొచ్చారు. గాయానికి కట్టుకట్టి ఉపశమనం కలిగించారు. తరువాత ఆస్పత్రికి తీసుకెళ్లి టీటీ ఇంజక్షన్‌ వేయించారు. రెండు మూడు రోజులకు గాయం తగ్గింది.


వంగర మండలం కొప్పర కొత్తవలసకు చెందిన ఓ రై తు పొలంలో దున్నుతుండగా కాలికి చిన్నపాటి ఇనుప మేకు గుచ్చుకుంది. రక్తస్రావం కావడం ప్రారంభించింది. దీంతో ఆ రైతు పసరు మందువేసి వస్త్రంతో గట్టిగా కట్టేశాడు. మూడు రోజుల తరువాత ఆ గాయం తీవ్రమైంది. పెద్దదిగా మారిపో యింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రథమ చికిత్స చేయడంలో నిర్లక్ష్యం చేయడంతో ఆ గాయం పెద్దదైంది. ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలో ఉంచి వైద్యసేవలందించారు.


రాజాం పట్టణానికి పనుల నిమిత్తం పాలకొండకు చెందిన వ్యకి బైక్‌పై వచ్చాడు . దారిలో మూర్చకు గురై కింద పడిపోయాడు. వెంటనే అటువైపుగా వెళుతున్న వారు సపర్యలు చేశారు. ప్రథమ చికిత్స అందించారు. ఆయన కోలుకున్న తరువాత ఆస్పత్రిలో చేర్పింంచారు.


రాజాం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రమాదం జరిగిన తరువాత నిపుణుల వైద్యం అందేలో గా ‘ప్రథమ చికిత్స’ (First Aid) చాలా కీలకం. అలా సరైన సమయం లో ప్రథమ చికిత్స అందక చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక వీటిపై కావాల్సింది అవగాహన మాత్రమే. సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే చాలా మంచిది. ఇటీవల దీనికి బహుళ ప్రాచుర్యం కల్పిస్తున్నారు.

అంబులెన్స్‌ కోసం వేచి ఉండకుండా..

ప్రమాదం జరిగినా.. ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి నా ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు సంఘటన జరి గిన గంటలోగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. దానినే ‘గోల్డెన్‌ అవర్‌’ అంటారు. ఆ సమయంలో ఆస్పత్రికి తీసుకొచ్చే వారికి సరై న వైద్యసేవలు అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చని వైద్యు లు చెబుతున్నారు. మన కంటి ముందు ప్రమాదం జరిగితే క్షతగాత్రులను చూసి 108కి ఫోన్‌ చేస్తాం. వాహనం వచ్చే వరకూ వేచిచూస్తాం. కానీ గాయపడిన వ్యక్తికి ప్రథమ చి కిత్స చేస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చన్న ఆలోచన చాలా మం ది చేయరు. ఇది మంచి పద్ధతి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏబీసీ విధానంలో ప్రథమ చికిత్స అందిం చాలని సూచిస్తున్నారు. ఎయిర్‌, బ్రీతింగ్‌, సర్క్యులేషన్‌ (ఏబీసీ) విధా నంతో రోగి/ క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందిస్తే ప్రాణాలు నిలబెట్టవ చ్చు. ముఖ్యంగా గుండెపోటుతో శ్వాస అందని వారికి ఇలా ఏబీసీ విధానంలో సీపీఆర్‌ చేసి ప్రాణాలను నిలబెట్టవచ్చు.


కిట్లలో ఇవి ‘కీ’లకం

ప్రథమచికిత్స కిట్లు ప్రతి ఇంటా ఉంచుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు రకరకాలైన కిట్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ఆ కిట్లలో యాస్పిరిన్‌, డిస్పో జబుల్‌ నాన్‌ లెటెక్స్‌ గ్లవ్స్‌, శానిటైజర్‌, యాంటీ సెప్టిక్‌ వైప్‌, ఆయింట్‌మెంట్‌, వాటర్‌ప్రూఫ్‌ ప్లాస్టర్‌, బ్యాండేజీ, ఇన్‌స్టంట్‌ ఐస్‌ బ్యాగులు, కత్తెర, సీపీఆర్‌ ఫేస్‌ షీల్డ్‌, బర్న్‌ హైడ్రోజల్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. పొలాలు, వాహనా లు, పాఠశాలలు, కాలేజీలు, అపార్ట్‌మెంట్లు, మాల్స్‌, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో ప్రథమ చికిత్స బాక్సులు తప్పనిసరి చేయాలి. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే సీపీఆర్‌పై అవగాహన కల్పించాలి. ప్రత్యేక శిక్షణనిచ్చి అలవాటు చేయాలి.


ఇది తెలుసా?

ప్రమాదాలు జరిగే సమయంలో మొదటి గంటలో ఆస్పత్రికి తీసుకొచ్చే వారి సేవలను ‘గుడ్‌ సమారిటన్‌’ పేరిట కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. 2021 నుంచి ఏటా బహుమతులను సైతం అందిస్తోంది. ప్రజల్లో బాధ్యతను పెంచాలన్న ఉద్దేశంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకొచ్చే వారికి నగదు ప్రోత్సహకాలు అందిస్తున్నారు. మన జిల్లాలో సైతం రహదారి భద్రతా వారోత్సవాల సమయంలో ఇలాంటి వారిని ఎంపిక చేసి రవాణా శాఖ అధికారులు ప్రోత్సాహకాలను అందించారు.


పాము, కుక్కకాట్ల సమయంలో..

జిల్లా ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. పొలాలకు వెళ్లేవారికి పాముకాట్లు వేస్తుంటాయి. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ప్రథమ చికిత్స కీలకం. పాముకాటు వేసిన శరీరభాగాన్ని సబ్బు నీరు లేదా యాంటీ సెప్టిక్‌ లోషన్‌తో శుభ్రం చేయాలి. నొప్పి తగ్గేందు కు ఎలాంటి మందులు వాడకూడదు. పాముకాటు వేసిన చోట కొద్దిసేపు ఐస్‌ ముక్క ఉంచడం ఉత్తమం. పాము కాటు వేసిన భాగంపైన వస్త్రంతో కానీ.. తాడుతో కానీ గట్టి గా కట్టాలి. 15 నిమిషాలకు ఒకసారి వదులు చేస్తుండాలి. సాధ్యమైనంత త్వరగా బాధితుడిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. కుక్క కరిచినా అవే జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే ఆ భాగాన్ని సబ్బునీటితో కడగాలి. గోరువెచ్చని నీటిని పది నిమిషాల పాటు గాయంపై పోయాలి. రక్తం కారకుండా తుడవాలి. స్టెరైల్‌ బ్యాండేజీని గాయం చుట్టూ చుట్టాలి. వీలైనంత త్వరగా వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.


అపర సంజీవిని.. -కరణం హరిబాబు, వైద్యుడు, రాజాం

ప్రథమ చికిత్స అనేది ప్రమాదంలో ఉన్నవారికి అపర సంజీవిని. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ప్రథమ చికిత్స అంది స్తే ప్రాణాలను నిలపవచ్చు. ప్రమాదం జరిగినప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు తొలిగంట గొల్డెన్‌ అవర్‌. ఆ సమయంలో ఎంతటి సంక్లిష్ట పరిస్థితినైనా ప్రథమ చికిత్స ద్వారా ఎదుర్కొనవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికీ ప్రథమ చికిత్సపై అవగాహన పెరగాలి. ప్రతి ఇంట్లో ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 13 , 2025 | 09:35 AM