Simhachalam Devasthanam Accident: సింహాచలం దుర్ఘటన.. ఏడుగురిపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - May 05 , 2025 | 09:12 PM
Simhachalam Devasthanam Accident: సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్ సోమవారం నివేదిక అందించింది. ఆ కొద్దిసేపటికే కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పలువురు అధికారులను బాధ్యులను చేస్తూ.. వారిపై సస్పెన్షన్ వేటు వేసింది.
అమరావతి, మే 05: సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్ సోమవారం నివేదిక అందించింది. ఆ కొద్దిసేపటికే కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన ఏడుగురిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దేవాదాయ శాఖతోపాటు పర్యాటక శాఖలలోని వారిపై ఈ సస్పెన్షన్ వేటు వేసింది. సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, సింహాచలం దేవస్థానం ఈఈ డి జి శ్రీనివాసరాజు, ఏపీటీడీసీ ఈఈ కె రమణ, దేవస్థానం డిప్యూటీ ఈఈ కె ఎస్ ఎన్ మూర్తి, ఏపీటీడీసీ డిప్యూటీ ఈఈ ఏ బీ వీ ఎల్ ఆర్ స్వామి, ఏపీటీడీసీ ఏఈ పి మదన్ మోహన్, దేవస్థానం జేఈ కె బాబ్జీపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇక కాంట్రాక్టర్ కె లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యల తీసుకోవాలని ఆదేశించింది.
సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం కమిషన్ నివేదిక అందజేసింది. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కమిషన్ నిర్దారించింది. తీవ్ర నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలు కోల్పోవడానికి కాంట్రాక్టర్, అధికారులు కారణమయ్యారని ఆ నివేదికలో స్పష్టం చేసింది. ఇక ఈ కమిషన్ సిఫార్సు ఆధారంగా చర్యల తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయించింది.
కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. కాంట్రాక్టర్ సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రికి కమిషన్ నివేదిక అందజేసింది. ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఐఎఎస్, ఐపిఎస్, ఇంజినీరింగ్ అధికారులున్నారు. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ అధికారుల సస్పెన్షన్‌కు ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Simhachalam Incident: సింహాచలం ఘటన.. ప్రభుత్వం చేతిలో కీలక నివేదిక Earthquake: భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు
Vidadala Rajini: విడదల గోపి బెయిల్ పిటిషన్ డిస్మిస్.. జైలుకు తరలింపు
Pahalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం
TGSRTC Workers Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Andhrapradesh News And Telugu News