Earthquake: భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు
ABN , Publish Date - May 05 , 2025 | 07:11 PM
Earthquake: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భూప్రకంపనలు సంభవించాయి. జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ ఒక్కసారిగా భూమి కంపించింది.
కరీంనగర్, మే 05: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భూప్రకంపనలు సంభవించాయి. జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. ధర్మపురి, సిరిసిల్ల, సుల్తానాబాద్‍లోనూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 3.5గా భూకంప తీవ్రత నమోదైంది. దాదాపు ఐదు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని సామగ్రి సైతం కదిలిపోవడంతో ఏ జరుగుతుందో అర్థంకాక భయంతో బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు నెలల వ్యవధిలో ఇలా భూమి కంపించడం రెండోసారి కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. అలాగే నిర్మల్ జిల్లాలోనూ పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.
మరోవైపు పాకిస్థాన్‌లో సైతం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా రికార్డయింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు భూమి ప్రకంపించినట్లు జాతీయ భూకంపం సంస్థ వెల్లడించింది. ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఛిత్రాల్ జిల్లాలో ఈ భూకంపం సంభవించిందని స్థానిక మీడియా వెల్లడించింది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన ఈ భూమిలో కదలికలు చోటు చేసుకున్నాయని తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్ సరిహద్దుల్లో ఛిత్రాల్ జిల్లా ఉంటుంది. ఈ భూప్రకంపనలు రెండు దేశాల్లో నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలతో ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Vidadala Rajini: విడదల గోపి బెయిల్ పిటిషన్ డిస్మిస్.. జైలుకు తరలింపు
Pahalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం
TGSRTC Workers Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం