Anitha Fires on Jagan: జగన్ హయాంలో కల్తీ మద్యంతో ప్రాణాలు తీశారు.. హోంమంత్రి అనిత ఫైర్
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:35 PM
కూటమి ప్రభుత్వంలో గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారని పేర్కొన్నారు.
విశాఖపట్నం, అక్టోబర్6 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో కల్తీ మద్యంతో ఎంతోమంది ప్రాణాలను తీశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ (YSRCP) హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంతో పలువురు ప్రాణాలు కోల్ఫోయారని గుర్తుచేశారు. ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)కి లేదని ధ్వజమెత్తారు. గత జగన్ ప్రభుత్వంలో ఇద్దరు గిరిజనులు డిప్యూటీ సీఎంలు అయ్యారని... కానీ కనీసం ఒక్కసారైనా ఆశ్రమ పాఠశాలలను సందర్శించారా..? అని ప్రశ్నించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు హోంమంత్రి అనిత.
ఇవాళ (సోమవారం) కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మన్యం జిల్లా గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులను అనిత పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు. వైద్యుల నిపుణులతో ఒక కమిటీ వేశామని.. సమగ్రమైన విచారణ జరుగుతోందని చెప్పుకొచ్చారు. పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సంధ్యారాణి నిన్న(ఆదివారం) పరామర్శించారని తెలిపారు హోంమంత్రి అనిత.
కూటమి ప్రభుత్వంలో గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని వ్యాఖ్యానించారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడూ అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పరిశీలిస్తున్నారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ముంబైలో నారా లోకేష్ పర్యటన.. ఎందుకంటే..
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News