Share News

CM Chandrababu: ఐఏఎస్ చదవాలని చెప్పారు.. నేనే రాజకీయాల్లోకి వచ్చాను..

ABN , Publish Date - Sep 25 , 2025 | 07:02 PM

తన ప్రొఫెసర్ డీఎల్ నారాయణ తనని ప్రోత్సహించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రోత్సహంతోనే యూనివర్సిటీ నుంచి రాజకీయల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యానని వివరించారు.

CM Chandrababu: ఐఏఎస్ చదవాలని చెప్పారు.. నేనే రాజకీయాల్లోకి వచ్చాను..
CM Chandrababu Naidu

అమరావతి: మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డీఎస్సీ వేదికపై నూతనంగా ఎంపికైన టీచర్లు అడిగిన ప్రశ్నకు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనని ఐఏఎస్ చదవాలని కొందరు చెప్పారని గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో అంత ఓపిక తనకు లేదని చెప్పుకొచ్చారు. తన చదువు అంతంత మాత్రమేనని చమత్కరించారు.


ఆ తర్వాత తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. తమ ప్రొఫెసర్ డీఎల్ నారాయణ తనని ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే యూనివర్సిటీ నుంచి రాజకీయల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యానని చంద్రబాబు వివరించారు. ఆ తర్వాత ప్రజల దయతో.. సీఎంగా ఎదిగానని చెప్పారు. టీచర్లు పిల్లల మనోభవాలకు అనుగుణంగా టీచ్ చేస్తే అద్బుత ఫలితాలు వస్తాయని సూచించారు. ఏపీ నెంబర్ 1గా కావాలంటే ఆ శక్తి టీచర్లకు మాత్రమే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.


Also Read:

ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్

వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..

Updated Date - Sep 25 , 2025 | 07:59 PM