Share News

CM Chandrababu At Visakha Food Summit: రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా ఏపీ ప్రసిద్ధి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 29 , 2025 | 01:13 PM

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రైతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu At Visakha Food Summit: రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా ఏపీ ప్రసిద్ధి: సీఎం చంద్రబాబు
CM Chandrababu At Visakha Food Summit

విశాఖపట్నం, ఆగస్టు29 (ఆంధ్రజ్యోతి): ఆక్వా, బెవరేజెస్ రంగాల హబ్‌గా ఏపీ ఎదుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Chandrababu Naidu) ఉద్ఘాటించారు. పెట్టుబడిదారులు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా తదితర రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. వీటన్నిటికీ వేగంగా అనుమతులు ఇస్తామని తెలిపారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలా.. అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బిల్‌గేట్స్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.


దేశంలోని పండ్ల ఉత్పత్తుల్లో 25 శాతం ఏపీ నుంచే వెళ్తున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రైతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌ డోర్న్‌ సిటీగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఏపీలో 9 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కులు ఉన్నాయని వివరించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందని ఉద్ఘాటించారు. ఇవాళ(శుక్రవారం) ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సమ్మిట్‌ను సీఎం ప్రారంభించారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. విలువ జోడించిన ఫుడ్, సీఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యంతో టీపీసీఐ ఈ సదస్సు నిర్వహిస్తోందని వెల్లడించారు సీఎం చంద్రబాబు.


ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్ మూడో ఎడిషన్‌ను విశాఖలో టీపీసీఐ నిర్వాహకులు నిర్వహించారు. ఈ సమ్మిట్‌కు మంత్రి టీజీ భరత్, టీపీసీఐ చైర్మన్ మోహిత్ సింగ్లా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక ప్రతినిధులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎగుమతిదారులు, పరిశోధకులు, టెక్నాలజీ ప్రొవైడర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్, బెవరేజ్, ఆక్వా, ఇతర వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాలసీలపై సీఎం చంద్రబాబు వివరించారు.


సీఎం చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్య అంశాలు...

  • విశాఖపట్నం అందమైన నగరమే కాదని.. మహిళలకు సురక్షితమైన నగరం కూడా అని తెలిపారు. విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి.

  • త్వరలోనే పారిశ్రామికంగా సీ కేబుల్, డేటా సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి.

  • ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా తదితర రంగాల్లో అపారమైన అవకాశాలను చాటిచెప్పేలా టీపీసీఐ సదస్సును నిర్వహించటం అభినందనీయం.

  • ప్రపంచవ్యాప్తంగా ఆహార శుద్ధి పరిశ్రమ విలువ 8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

  • 2030 నాటికి 700 బిలియన్ల డాలర్లకు దేశంలోని ఆహారశుద్ధి పరిశ్రమ చేరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

  • అయితే ఈ రంగంలో దేశం ఇంకా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

  • ఫుడ్ ప్రాసెసింగ్‌‌లో ఏపీ 9శాతం వాటాతో 50 బిలియన్ల డాలర్ల విలువను కలిగి ఉంది.

  • జీఎస్‌ డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల జీవీఏ రూ. 5.19 లక్షల కోట్ల మేర ఉంది.

  • ఏపీ జీఎస్ డీపీలో 35 శాతం మేర వాటాను వ్యవసాయం అనుబంధ రంగాలు కలిగి ఉన్నాయి.

  • ఏపీ ప్రస్తుతం ఫ్రూట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంది. త్వరలోనే మొత్తం ఉత్పత్తిలో 25 శాతానికి చేరుకుంటాం.

  • 2.26 లక్షల హెక్టార్లలో ఆక్వా కల్చర్ చేస్తున్న ఏపీ దేశానికే ఆక్వా హబ్‌గా ఉందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


  • ప్రస్తుతం ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అందిపుచ్చుకోవాలి.

  • పట్టణీకరణ, జీవనశైలి, తలసరి ఆదాయాలు కొత్త అవకాశాలకు దారితీస్తున్నాయి.

  • ఏపీలోని చిత్తూరు, గుంటూరు, కోస్తాంధ్ర జిల్లాలు, విశాఖలలో పండ్లు, మసాలా దినుసులు, ఆక్వా, కోకూ, కాఫీ లాంటి క్లస్టర్లు ఉన్నాయి.

  • గ్లోబల్ బ్రాండ్స్ ఫ్రమ్ ఇండియా బై ఇండియన్స్ అనేది మన నినాదం కావాలి.

  • ఏపీలో అంతర్జాతీయస్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకోసిస్టం ఉంది.

  • 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్, 33 లక్షల టన్నుల గోదాముల సామర్ధ్యం ఉంది.

  • 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాం.

  • ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్ కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.

  • అగ్రిటెక్ రంగంలో బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నాం.

  • ట్రేబిలిటి, సర్టిఫికేషన్‌లకు, ప్రాడెక్టు పర్ఫెక్షన్‌కు ఏపీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

  • ఇప్పుడు ప్యాకేజింగ్ అనేది ఇప్పుడు ప్రధాన సవాలుగా ఉంది. దీనిపై కూడా ఏపీ పనిచేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


  • ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం

  • * రూ. 200 కోట్ల పెట్టుబడులు దాటితే మెగా ప్రాజెక్టుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తాం

  • * వచ్చే ఐదేళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 1 లక్ష కోట్ల మేర పెట్టుబడులు సాధిస్తాం

  • * రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆవిష్కరణలకు కూడా పెద్ద పీట వేసేందుకు ఏపీ సిద్ధం

  • * కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో గత ఏడాదిగా రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

  • * పెట్టుబడులకు ఇదే మంచి సమయం , ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు ఇచ్చేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి

  • * రిస్క్ లయబిలిటీ చాలా తక్కువగా ఉంది. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి

  • * వ్యవసాయాన్ని లాభదాయకంగా - సుస్థిరంగా మార్చటమే నా లక్ష్యం

  • * ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఏపీ చాప్టర్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించటం సంతోషదాయకం


  • ఫుడ్‌ప్రాసెసింగ్‌ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయి.

  • ఏపీది 50 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ.

  • వ్యవసాయం నుంచి 35శాతం GSDP వచ్చే రాష్ట్రం ఏపీ.

  • హార్టికల్చర్‌, లైవ్‌స్టాక్‌, ఆక్వా కల్చర్‌ రంగాల్లో అగ్రస్థానంలో ఏపీ.

  • దేశంలోని పండ్ల ఉత్పత్తుల్లో 25శాతం ఏపీ నుంచే...

  • ఏపీలో 2.26 లక్షల హెక్టార్లలో ఆక్వాకల్చర్‌.

  • రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా ఏపీ ప్రసిద్ధి.

  • ఆక్వా, కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఏపీ.

  • ఏపీలో 9 ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ప్రాసెసింగ్‌ పార్కులు.

  • 2027 నాటికి పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం.

  • ఏపీలో ఇప్పటికే 85 శాతం రిజర్వాయర్లు నిండాయి.

  • ఏపీలో కోల్డ్‌స్టోరేజీల సామర్థ్యం 17 లక్షల మెట్రిక్‌ టన్నులు.

  • ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు చొప్పున 20 పోర్టులు నిర్మిస్తాం.

  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్కు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


పండ్లు, ఆక్వా రంగాల్లో అతిపెద్ద ఎగుమతిదారుగా ఏపీ: చిరంజీవి చౌదరి

పండ్లు, ఆక్వా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందని పుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. దేశ ఎగుమతుల్లోనూ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తోందని చెప్పుకొచ్చారు. ఉద్యాన, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్, బెవరేజెస్ రంగాల్లో అపారమైన అవకాశాలు ఏపీలో ఉన్నాయని వెల్లడించారు. ఫుడ్, బెవరేజెస్ రంగం ఇప్పుడు విస్తృతంగా పెరుగుతోందని వివరించారు. అందుకు అవసరమైన పాలసీలు కూడా ఏపీలో అందుబాటులో ఉన్నాయని చిరంజీవి చౌదరి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ క్రీడాకారులకు బంపరాఫర్.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఆ అధికారిని విమర్శిస్తారా.. భూమన కరుణాకర్ రెడ్డిపై చింతా మోహన్ ఫైర్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 29 , 2025 | 02:20 PM