Share News

CM Chandrababu: యోగా నిర్వహణలో కొత్త రికార్డ్ సృష్టించబోతున్నాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 16 , 2025 | 06:18 PM

విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కచోటే మూడు లక్షల మందితో యోగా చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏపీవ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా డేలో పాల్గొంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu: యోగా నిర్వహణలో కొత్త రికార్డ్ సృష్టించబోతున్నాం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

విశాఖపట్నం: నగరంలో నిర్వహించే యోగా కార్యక్రమంతో సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తెలిపారు. పదేళ్ల తర్వాత ఏపీలో అతిపెద్ద యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇవాళ(సోమవారం) విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఈనెల 21న యోగా డే సందర్భంగా బీచ్ రోడ్‌లో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లని ఆయన పరిశీలించారు.


CM-Chandrababu-Naidu-2.jpg

బీచ్ రోడ్ నుంచి రుషికొండ వరకూ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీఎంకు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్, ఐపీఎస్ అధికారులు వివరించారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో మంత్రుల కమిటీ, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్‌ యూనిట్‌గా సిబ్బంది పర్యవేక్షణపై ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఇతర సిబ్బందిని నియమిస్తే జవాబుదారీ ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.


సెక్రటేరియట్ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. వరల్డ్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్‌‌లోకి యోగా కార్యక్రమం ఎక్కేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. దాదాపు 3.4 లక్షల మంది ఒకే చోట యోగా చేయడానికి ఏర్పాట్లు చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విశాఖలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక్కచోటే మూడు లక్షల మందితో యోగా చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏపీవ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా డేలో పాల్గొంటారని చెప్పారు. యోగా డేలో నేవీ 11 యుద్ధ నౌకలను ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ఒక చారిత్రక కార్యక్రమానికి విశాఖపట్నం వేదిక అవుతోందని అన్నారు. 11ఏళ్ల యోగా డేకు విశాఖ అనువైన ప్రదేశమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM-Chandrababu-Naidu-1.jpg


ప్రశాంతతకు, పాజిటివ్ యాటిట్యూడ్‌కు విశాఖపట్నం నిలయం..

‘ప్రశాంతతకు, పాజిటివ్ యాటిట్యూడ్‌కు నిలయం విశాఖపట్నం. ఇక్కడి ప్రజలకు ఒక పిలుపునిస్తే పాటిస్తారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. యోగాకు అనువైన ప్రదేశం విశాఖపట్నం. యోగా అందరి జీవితాల్లో భాగం కావాలి. ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు యోగా ద్వారా తగ్గుతాయి. యోగా అనేది వారసత్వ సంపద.. ప్రజల భవిష్యత్ కోసం చేస్తున్న పెద్ద ఈవెంట్ ఇది. అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరుతున్నాం. యోగా ప్రివెంటివ్ హెల్త్‌కి బాగా ఉపయోగపడుతుంది. యోగాకు కొంత సమయం కేటాయించాలి. హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ కోసం పనిచేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగాని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.


22 రికార్డులు నమోదు చేయబోతున్నాం..

‘యోగా ద్వారా గిన్నిస్ రికార్డుతో పాటుగా సుమారుగా 22 రికార్డులు నమోదు చేయబోతున్నాం. వర్షం వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశాం. ప్రస్తుతం వర్షం వచ్చేందుకు ఆస్కారం లేదు.సెంట్రల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా చేయాలని ఆలోచన చేస్తున్నాo. యోగాని సమర్థవంతంగా, నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమం తదనంతరం కూడా యోగాని కొనసాగిస్తాం’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 07:32 PM