Share News

Androth joins Indian Navy: భారత నౌకదళంలోకి చేరిన మరో యుద్ధనౌక ఆండ్రోత్‌.. ఈ నౌక స్పెషల్ ఇదే..

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:50 AM

భారత నౌకదళంలోకి మరో యాంటి సబ్ మెరైన్ వార్‌ఫైర్ నౌక INS ఆండ్రోత్‌ చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకని నిర్మించారు. ఈ నౌక కలకత్తాకు చెందినది.

Androth joins Indian Navy: భారత నౌకదళంలోకి చేరిన మరో యుద్ధనౌక ఆండ్రోత్‌.. ఈ నౌక స్పెషల్ ఇదే..
Androth joins Indian Navy

విశాఖపట్నం, అక్టోబర్6 (ఆంధ్రజ్యోతి): భారత నౌకదళం (Indian Navy)లోకి మరో యాంటి సబ్ మెరైన్ వార్‌ఫైర్ నౌక INS ఆండ్రోత్‌ (Androth) చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకని నిర్మించారు. ఈ నౌక కలకత్తా (Kolkata)కు చెందినది. INS ఆండ్రోత్‌ని ENC చీఫ్ పెందార్కర్ (Pendharkar) ఘనంగా ప్రారంభించారు. భారత నావికాదళంలో రెండో యాంటి సబ్ మెరైన్ వార్‌ఫైర్ నౌకగా చేరింది INS ఆండ్రోత్‌.


భారత నావికాదళంలో మొదట యాంటి సబ్ మెరైన్ వార్‌ఫైర్ నౌక INS ఆర్నాల మూడు నెలల క్రితం చేరింది. ఆండ్రోత్‌ నౌకను కలకత్తాకి చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ కంపెనీ తయారుచేసింది. లక్షద్వీప్ దీవుల్లో ఒక దీవి పేరు మీద INS ఆండ్రోత్‌కి నామకరణం చేశారు. భారత సముద్ర భద్రతని మరింత బలపరిచే కీలక నౌక ఇది. సముద్రతీర ప్రాంతాల్లో సబ్ మెరైన్ ధ్వంసం, కంట్రోల్, కోస్టల్ ప్రొటెక్షన్‌కి ఆండ్రోత్‌ నౌకని భారత నావికాదళం ఉపయోగించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ముంబైలో నారా లోకేష్ పర్యటన.. ఎందుకంటే..

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 06 , 2025 | 12:15 PM