Minister Payyavula: కేసీఆర్, జగన్ రిటర్న్ గిప్టులు ఇచ్చుకునేవారు.. పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 07:02 PM
ఈ దొంగఓట్ల విషయంలో వైసీపీ వారే.. హాట్ లైన్ ద్వారా రాహుల్ గాంధీకి చెప్పి నేర్పించినట్టు ఉందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏలో బలమైన, నమ్మకమైన భాగస్వామ్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు తమ పార్టీ మెంబరే అని తెలిపారు.
అమరావతి: దొంగఓట్ల గురించి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ , మాణిక్యం ఠాగూర్ ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. వైసీపీ దొంగఓట్ల వ్యవహరాన్ని ఉరవకొండ నుంచి మొదలుపెట్టిందని గుర్తు చేశారు. తాము ప్రజల్ని నమ్ముకున్నామని, దొంగఓట్లను నమ్ముకోలేదని స్పష్టం చేశారు.
రిటర్న్ గిప్టులు ఏమైపోయాయి..
ఈ దొంగఓట్ల విషయంలో వైసీపీ వారే.. హాట్ లైన్ ద్వారా రాహుల్ గాంధీకి చెప్పి నేర్పించినట్టు ఉందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏలో బలమైన, నమ్మకమైన భాగస్వామ్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు తమ పార్టీ మెంబరే అని తెలిపారు. మీకు కేసీఆర్ మధ్య సంబంధ బాంధవ్యాలు ఏమైపోయాయని, గిప్ట్‌లు రిటర్న్ గిప్టులు ఏమైపోయాయని విమర్శించారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంపై మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు, క్యాడర్‌ను రెచ్చగొట్టేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పులివెందుల ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటేశారని పేర్కొన్నారు. రేపు వచ్చే పులివెందుల ఫలితాలను స్వీకరించేందుకు జగన్ సిద్ధంగా ఉండాలని సూచించారు.
చంద్రబాబు జాతీయ స్థాయి లీడర్...
సీఎం చంద్రబాబు ఇప్పడు జాతీయ స్థాయిలో గొప్పలీడర్ అని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. మరో పదేళ్లపాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని చెప్పారు. జగన్ హయాంలో పోలీసులపై అనేక ఒత్తిళ్లు పెట్టారని, తమ ప్రభుత్వంలో ఆ శాఖ స్వచ్ఛందంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శచడం పక్కన పెట్టి వైసీపీ నేతలు వచ్చే ఎన్నికల బరిలో నిలిచేందుకు అర్హులుగా ఉంటారో లేదో చూసుకోవాలని పయ్యావుల హితవుపలికారు.