Rahul Gandhi: ప్రమాదాలు.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి..
ABN , Publish Date - Oct 24 , 2025 | 10:53 AM
రవాణా శాఖలో ప్రయాణికుల భద్రతే ముఖ్యం కావాలని రాహుల్ గాంధీ సూచించారు. వాహనాలను తగిన విధంగా మెయింటైన్ చేయాలని చెప్పారు.
ఢిల్లీ: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తరచూ జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా శాఖలో ప్రయాణికుల భద్రతే ముఖ్యం కావాలని సూచించారు. వాహనాలను తగిన విధంగా మెయింటైన్ చేయాలని చెప్పారు. ప్రమాదాలకు బాధ్యులెవరో వారిని జవాబుదారి చేయాలని రాహుల్ గాంధీ చెప్పారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. ఓ బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి అంతకంతకూ పెరిగి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్సులోనే పలువురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు మంటలను చూసిన వెంటనే అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. బైకు బస్సు కిందకు వెళ్లి డీజిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
Election Commission: సర్‌కు సన్నాహాలు చేయండి
Chennai: నాన్నే నేరస్తుడని నమ్మించేలా అమ్మను చంపేశాడు