Mantralayam Vinayaka immersion: వినాయకుడి నిమజ్జనంలో మొసలి కలకలం.. శవాన్ని మింగిన మొసలి
ABN , Publish Date - Aug 30 , 2025 | 06:51 AM
సాధారణంగా వినాయక చవితి నుంచి వినాయక ఉత్సవాలు నెల రోజులపాటు ఉంటాయి. కొంతమంది ఒకరోజు, కొంతమంది మూడు రోజులు, కొంతమంది ఐదు రోజులు, కొంతమంది 9 రోజులు, కొంతమంది 15 రోజులు తరువాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
కర్నూలు: మంత్రాలయం వినాయక నిమజ్జనంలో మొసలి కలకలం రేపింది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా.. మూడో రోజు వినాయకుడిని మంత్రాలయం తుంగభద్ర నదిలో నిమజ్జనం కోసం నిర్వాహకులు తీసుకెళ్లారు. అయితే నిమజ్జనం సమయంలో నదిలో మొసలి ఉండటం చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే భయాందోళనతో పరుగులు తీశారు. అయితే అప్పటికే.. మొసలి గుర్తు తెలియని శవాన్ని మింగినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలి సంచారం దృష్ట్యా నదిలో నిమజ్జనం చేసే వారు..నదిలోకి దిగకుండా అప్రమత్తంగా.. ఉండాలని, నిమజ్జనం సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
సాధారణంగా వినాయక చవితి నుంచి వినాయక ఉత్సవాలు నెల రోజులపాటు ఉంటాయి. కొంతమంది ఒకరోజు, కొంతమంది మూడు రోజులు, కొంతమంది ఐదు రోజులు, కొంతమంది 9 రోజులు, కొంతమంది 15 రోజులు తరువాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. అయితే.. ఈ నిమజ్జనం సమయంలో.. స్థానికులు దగ్గరలోని చెరువులు, నదులు, కుంటలలో నిమజ్జనం చేస్తుంటారు. ఈ సమయంలో చాల మంది భక్తులు చెరువులోకి, నదుల్లోకి దిగి.. మృత్యువాత పడుతున్నారు. అలా దిగినప్పుడు అక్కడ ఉన్న విషపూరిత సర్పాల కాటు వల్ల కూడా కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. వీటన్నిటిపైన.. అధికారులు దృష్టి సారిస్తున్నారు. నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు వినాయకుడి నిర్వాహకులు పలు సూచలను పాటించాలని వెల్లడించారు. చెరువులోకి, కుంటల వద్దకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిమజ్జన కొలువుల్లో నిమజ్జనం చేయాలని అధికారులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..