Share News

Vijayawada Metro Rail Project: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు అప్‌డేట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Sep 08 , 2025 | 08:28 AM

విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్ల నిర్మాణ పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. ఈ నెల 18న టెండర్లు తెరవాల్సి ఉంది. అయితే ఇటీవల ఏపీఎంఆర్‌సీ అధికారులు కాంట్రాక్టు సంస్థలతో ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించారు.

 Vijayawada Metro Rail Project: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు  అప్‌డేట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Vijayawada Metro Rail Project

  • విజయవాడ 'మెట్రో' ప్రీబిడ్ మీటింగ్‌లో కాంట్రాక్టర్ల అభిప్రాయం

  • గంపగుత్తగా కాకుండా పనులను విభజించాలని సూచన

  • జాయింట్ వెంచర్ పనిచేయటానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి

  • మెట్రో రైల్ ప్రాజెక్టుకు కాంట్రాక్టు సంస్థల నుంచి స్పందన

  • బోర్డు మీటింగ్‌లో చర్చించాలని భావిస్తున్న ఏపీఎంఆర్‌సీ

  • టెండర్ల ప్రక్రియ అక్టోబరు 14వ తేదీకి వాయిదా

‘విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు (Vijayawada Metro Rail Project) టెండర్లు స్ట్రీట్ చేయండి.. బాయింట్ వెంచర్లకు అవకాశం కల్పించండి' అంటూ తాజాగా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్‌లో కాంట్రాక్ట్ సంస్థల నుంచి అభిప్రాయాలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని రెండు, మూడు రోజుల్లో ఏపీఎంఆర్‌సీ బోర్డు సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో కాంట్రాక్టు సంస్థల సూచనలపై చర్చించాలని భావిస్తోంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టు సంస్థల అభిప్రాయాన్ని తెలియపరచనుంది. ప్రీబిడ్ మీటింగు‌కు కాంట్రాక్టు సంస్థల నుంచి విశేష స్పందన రావడం, కీలకమైన అంశాలపై వారు చర్చ పెట్టడంతో టెండర్లను అక్టోబరు 14వ తేదీ వాటికి వాయిదా వేసింది.


డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ అనుమతుల కోసం ఎదురుచూపులు

విజయవాడలో మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు 65 కిలోమీటర్ల నాలుగు వరసల ఫ్లైఓవర్ మంజూరైంది మెట్రో కారిడార్ కారణంగా నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు 45 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను నిర్మించాలన్న ప్రతిపాదన ఏపీఎంఆర్‌సీ నుంచి వచ్చింది. డబుల్ డెక్కర్‌ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.1800 కోట్ల వ్యయం అవుతుందని ఇప్పటికే డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపారు. దీనికి సంబంధించి కూడా ఇంకా అనుమతులు రాలేదు. ప్రాజెక్టులో -జాప్యం జరగకుండా ఉండేందుకు ఏపీఎంఆర్సీ అన్ని ప్రయత్నాలను చేసింది. మెట్రో రైల్ అనుమతులతో పాటు, డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌కు కూడా అనుమతులు ఒకేసారి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్ల నిర్మాణ పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. ఈ నెల 18న టెండర్లు తెరవాల్సి ఉంది. అయితే ఇటీవల ఏపీఎంఆర్‌సీ అధికారులు కాంట్రాక్టు సంస్థలతో ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించారు. ప్రీ బిడ్ మీటింగ్‌కు పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు హాజరయ్యారు కాంట్రాక్టర్ల నుంచి ప్రధానంగా రెండు సూచనలు. వచ్చాయి. రూ.4,150 కోట్ల విలువతో గుత్తగా టెండర్లు ఎందుకు పిలవాల్సి వచ్చిందని పలు కాంట్రాక్టు సంస్థలు అడిగినట్టు తెలిసింది.


గుత్తగా కాకుండా పనులను స్పిట్ వేయాలన్న ప్రతిపాదనలు పలు కాంట్రాక్టు సంస్థల నుంచి వచ్చాయి. దేశంలో పలు మెట్రో కారిడార్ పనులలో రూ.300 కోట్లు ఆపైన కూడా స్పిట్ చేసి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారన్న విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. దీనిపై ఏపీఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం. దేశంలో పలు చోట్ల స్పిట్ చేసి టెండర్లు పిలిచిన మాట వాస్తవమేనని, అలా చేయటం వల్ల నిర్మాణ పనులలో విపరీతమైన జాప్యం జరుగుతున్న ఉదంతాలను ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును తాము ఎట్టి పరిస్థితులలో 2028 నాటికి పూర్తి చెయ్యాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నట్లు తెలిపారు. ప్రీబిడ్ మీటింగ్‌లో పాల్గొన్న మరికొన్ని సంస్థలు సింగిల్ కాకుండా జాయింట్ వెంచర్ (భాగస్వామ్య కాంట్రాక్టు సంస్థలు)కు కూడా అవకాశం కల్పించాలని కోరాయి. రెండు, మూడు సంస్థలు కలిసి ప్రాజెక్టు పనులలో పాలు పంచుకునేందుకు భాగస్వామ్యం కల్పించాలని ప్రతిపాదించాయి.


ప్రీబిడ్ మీటింగ్‌లో కాంట్రాక్టు సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొనటం ఒక ఎత్తు అయితే.. వాటి నుంచి వచ్చిన సూచనలు కూడా యూనిఫామ్‌గా ఉండటంతో వీటిపై బోర్డు మీటింగ్‌లో చర్చించాలని నిర్ణయించారు. బోర్డు మీటింగ్‌లో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లనున్నారు. దీని కోసం కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ నెల 10 నుంచి అక్టోబరు 14వతేదీ వరకు టెండర్ల గడువును పొడిగించారు.


కేంద్రం అనుమతులు రావాలి!

విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతులు రాలేదు. అధికారిక అనుమతుల కోసం ప్రతిపాదన వెళ్లింది. ఈ ప్రతిపాదన మేరకు ఇటీవల ట్రాఫిక్ స్టడీ నిర్వహించారు. మెట్రో ప్రాజెక్టు పనులలో జాప్యం జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే ముందుగా ఏపీఎంఆర్‌సీ టెండర్లు పిలిచింది. టెండర్లు ఖరారు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతులు కావాల్సి ఉంది. ఇటు ప్రీబిడ్ మీటింగ్‌లో కాంట్రాక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, కాటు కేంద్రం నుంచి అనుమతులు ఇంకా రాకపోవటాన్ని దృష్టిలో పెట్టుకుని టెండర్ల గడువును మరికొంత కాలం వాయిదా వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హై కోర్టుకు సిట్ అధికారులు.. ఎందుకంటే..

కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్.. అసలు విషయమిదే..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 08 , 2025 | 08:31 AM