Share News

Adwika Case: ‘అద్విక’ దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

ABN , Publish Date - Aug 10 , 2025 | 07:12 AM

సంచలనం కలిగించిన అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో 11 మంది ఇన్‌స్పెక్టర్లు, పదిమంది ఎస్ఐలను నియమించారు.

Adwika Case:  ‘అద్విక’ దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
Advika Trading Case

» సిట్ చీఫ్‌గా తిరుమలేశ్వర్‌రెడ్డి నియామకం

» 11 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు

విజయవాడ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): సంచలనం కలిగించిన అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కేసు (Adwika Trading Private Company Limited Case) దర్యాప్తునకుప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT Investigation Team) ఏర్పాటైంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో 11 మంది ఇన్‌స్పెక్టర్లు, పదిమంది ఎస్ఐలను నియమించారు. సిట్‌కు చీఫ్ క్రైమ్స్ డీసీపీ తిరుమలేశ్వర్‌రెడ్డిని నియమించారు.


ఇన్‌స్పెక్టర్లు ఆకుల నాగమురళీ (గవర్నర్‌పేట), సీహెచ్ ప్రకాశ్ (మాచవరం), వి.పవన కిషోర్ (పటమట), వాసిరెడ్డి శ్రీనివాస్ (గుణదల), డి.చవాన్ (నందిగామ రూరల్), డి.చంద్రశేఖర్ (మైలవరం), కె. కిషోర్‌బాబు (ట్రాఫిక్-3), ఎం. కిషోర్‌బాబు (సీసీఎస్), ఎ. సుబ్రహ్మణ్యం (టాస్క్ ఫోర్స్), ఎన్.రాజశేఖర్ (వీఆర్), పి.కనకారావు (పీసీఆర్), ఎస్ఐలు జి.రాజేంద్ర (కొత్తపేట), బిఅనూష (భవానీపురం), ఎం.ప్రశాంతి (గవర్నర్‌పేట), జె.భానుప్రసాద్ (కృష్ణలంక), జి.మహాలక్ష్ముడు (నున్న సీసీఎస్), వి.రమ్యశ్రీసత్య (అజిత్ సింగ్‌ నగర్), జి.శంకరరావు (మాచవరం), జి.రేవతి (పటమట), బి. అభిమన్యు (నందిగామ), కె.సుధాకర్ (మైలవరం)తో ఓ టీము కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ ఏసీపీ కె.దామోదరరావు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్నారు.


సుమారుగా రూ.300 కోట్ల డిపాజిట్లను అధ్విక వ్యవస్థాపకుడు తాడే పల్లి శ్రీవెంకట ఆదిత్య సేకరించాడు. ప్రస్తుతం అతడిని టాస్క్‌ఫోర్స్‌లో విచారణ చేస్తున్నారు. ఖాతాదారుల నుంచి సేకరించిన డబ్బును దుబాయ్‌లో ఖబానా సంస్థకు హవాలా మార్గంలో మళ్లించినట్లు ఇప్పటికే తేలింది. ఈ కేసులో బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన నిధులు, అద్విక ఖాతాలకు వచ్చిన నిధుల విషయంలో ఎలాంటి రికార్డులు లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం కష్టంగా మారింది. దీంతో అద్విక అసలు గుట్టును తేల్చి బాధితులకు న్యాయం చేయడానికి సీపీ ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేశారు. సిట్‌లో ఉన్నవారంతా క్రైమ్స్ డీసీపీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు

డాలర్‌ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం

For More AP News and Telugu News

Updated Date - Aug 10 , 2025 | 07:15 AM