Share News

NTR Health University: సెప్టెంబరు 9న ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్నాతకోత్సవం

ABN , Publish Date - Sep 06 , 2025 | 02:11 PM

ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27,28వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 9వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన స్నాతకోత్సవం జరగనుందని వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు.

NTR Health University: సెప్టెంబరు 9న ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్నాతకోత్సవం
NTR Health University

విజయవాడ, సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (NTR Health University) 27, 28వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల (సెప్టెంబరు) 9వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి ఇవాళ(శనివారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) అధ్యక్షతన ఈ స్నాతకోత్సవం జరుగనుందని తెలిపారు.


ఈ స్నాతకోత్సవంలో 120 మంది విద్యార్ధులకు 156 బంగారు, వెండి పతకాలు, క్యాష్ ప్రైజెస్ అందించనున్నామని పేర్కొన్నారు. 115 గోల్డ్, 41 సిల్వర్, 38 మందికి క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నామని ప్రకటించారు. న్యూఢిల్లీకి చెందిన నేషనల్ హార్ట్ ఇనిస్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఓపీ యాదవ్‌కు డాక్టర్ ఆఫ్ సైన్సెస్ గౌరవ డిగ్రీ అందించనున్నామని చెప్పుకొచ్చారు. పీహెచ్డీ చేసిన ఐదుగురికి, సూపర్ స్పెషాలిటీలో ఒకరికి డిగ్రీ సర్టిఫికెట్ల ప్రదానం చేయనున్నామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

స్మార్ట్ ఫోన్లు వచ్చాక లఘు చిత్రాలకు పెరిగిన ఆదరణ: మంత్రి నిమ్మల

మరోసారి రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఏం చేశారంటే..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 06 , 2025 | 02:16 PM