Share News

MP Shivnath on Vijayawada Festival: స్పెషల్‌గా విజయవాడ ఫెస్టివల్: ఎంపీ కేశినేని శివనాథ్

ABN , Publish Date - Sep 21 , 2025 | 06:44 PM

విజయవాడ అభివృద్ధిని కొంతమంది వైసీపీ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ధ్వజమెత్తారు. వైసీపీ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేశినేని శివనాథ్ చెప్పుకొచ్చారు.

MP Shivnath on Vijayawada Festival:  స్పెషల్‌గా విజయవాడ ఫెస్టివల్: ఎంపీ కేశినేని శివనాథ్
MP Keshineni Shivnath on Vijayawada Festival

ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా సంస్కృతి, సంప్రదాయాల ప్రతిభను మించేలా విజయవాడ ఫెస్టివల్ ఉండబోతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (MP Keshineni Shivnath) పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) విజయవాడ పున్నమి ఘాట్‌లో విజయవాడ ఫెస్టివల్ ఏర్పాట్లను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. విజయవాడ ఫెస్టివల్ రేపు(సోమవారం) ప్రారంభ అవుతుందని తెలిపారు.


24వ తేదీన భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విజయవాడ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయవాడలో తొలిసారిగా పర్యటిస్తున్నారని చెప్పుకొచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఫెస్టివల్‌ (Vijayawada Festival)కు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని వివరించారు ఎంపీ కేశినేని శివనాథ్.


విజయవాడ అభివృద్ధిని కొంతమంది వైసీపీ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. పున్నమి ఘాట్‌లో ప్రతిరోజు విజయవాడ వైభవాన్ని తెలిపే విధంగా డ్రోన్ షో ఉంటుందని తెలిపారు. రేపు విజయవాడ ఫెస్టివల్‌ని లాంఛనంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారని వెల్లడించారు. మొదటి రోజు, చివరి రోజు జరిగే క్రాకర్స్ షో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకో.. రఘురామ ప్రశ్నల వర్షం

కరుణాకర్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండగ‌‌‌‌‌.. భాను ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 07:14 PM