Lokesh: అమర్నాథ్ గౌడ్ హత్యపై చర్చకు వైసీపీ సిద్ధమా..: మంత్రి లోకేష్
ABN , Publish Date - Mar 04 , 2025 | 12:33 PM
వైసీపీ నేతలపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీలకు గత వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని, అమర్నాథ్ గౌడ్‌ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేసిందో చర్చించేందుకు సిద్దమేనా అంటూ మంత్రి సవాల్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు దిళితున్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశారా లేదా.. వైసీపీ సభ్యుడు త్రిమూర్తులు చెప్పాలన్నారు.
అమరావతి: ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) ప్రశ్నోత్తరాలపై చర్చ వాడి వేడిగా జరుగుతోంది. బీసీ (BC)ల సంక్షేమానికి (Welfare) నిధుల కేటాయింపుపై వైసీపీ సభ్యుల (YCP Leaders) ఆరోపణలకు ధీటుగా మంత్రులు (Ministers) నారా లోకేష్ (Nara Lokesh), సవిత (Savita) సమాధానం చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. బీసీలకు గత ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని, అమర్నాథ్ గౌడ్‌ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేసిందో చర్చించేందుకు సిద్దమేనా అంటూ మంత్రి సవాల్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు దిళితున్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశారా లేదా.. వైసీపీ సభ్యుడు త్రిమూర్తులు చెప్పాలన్నారు. వైసీపీ సర్కారు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో ఆ పార్టీ సభ్యులు చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
శ్రీశైలం పరిసరాల్లో పులులు, చిరుతల హల్ చల్..
ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్
డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. డీఎస్సీపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు. తిరిగి ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. వర్గీకరణపై త్వరలోనే వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇవ్వనుందని చెప్పారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదని విమర్శించారు. టీడీపీ పాలనలోనే 70 శాతం ఉపాధ్యాయ నియామకాలు జరిగాయని మండలిలో మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు.
మంత్రి సవిత మాట్లాడుతూ..

నా బీసీలు అంటూ గొప్పలు చేప్పిన వైఎస్ జగన్ ... ఐదేళ్లలో బీసీలకు ద్రోహం చేశారని మంత్రి సవిత ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 8 నెలల్లోనే రూ. 1977 కోట్లు స్వయం ఉపాధి పథకాలకే అమలు చేశామన్నారు. రూ. 200 కోట్లతో 1 లక్ష 2 వేల మందికి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. బీసీల కోసం కార్పోరేషన్ల కింద సబ్సిడీపై రుణాలు అందిస్తున్నా మని, ఆదరణ పథకానికి రూ. వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో బీసీ భవన్‌లు కట్టబోతున్నామని , బీసీ హాస్టళ్లు, గురుకులాలు మరమ్మతులు చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత సంచారం..
రాజమండ్రి పుష్కర ఘాట్‌లో పడవ బోల్తా ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News