Share News

Pushkara Ghat: రాజమండ్రి పుష్కర ఘాట్‌లో పడవ బోల్తా ..

ABN , Publish Date - Mar 04 , 2025 | 10:11 AM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పడవ మునిగిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 12 మంది పడవలో బ్రిడ్జి లంకకు వెళ్లారు. అందరూ తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. పడవలోకి నీరు చేరడం వల్లే ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Pushkara Ghat: రాజమండ్రి పుష్కర ఘాట్‌లో పడవ బోల్తా ..
Boat capsizes at Rajahmundry

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి (Rajahmundry) పుష్కర ఘాట్ (Pushkara Ghat) దగ్గర ఘోర ప్రమాదం (Boat Accident)జరిగింది. పుష్కర ఘాట్ గోదావరి నది మధ్యలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చెవల అన్నవరం, గాడా రాజు మృతి (Two dead) చెందారు. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు (Police) పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు., వివరాల్లోకి వెళితే.. గోదావరి నది మధ్యలో ఉన్న బ్రిడ్జి లంకకు12 మంది పడవలో వెళ్లారు. రాత్రి సమయంలో పడవలో తిరిగి వస్తుందగా రెండు వంతెనల మథ్యలో పడవలోకి నీరు చేరింది. దీంతో పడవ మునిగిపోయింది.

Read More..:

వారు ఓటు వేయడం నాకు గర్వకారణం


పడవలో ఉన్న ఇద్దరు నీటిలో మునిగిపోగా.. 10 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. లంకల్లోకి నాటుపడవల్లో మందు పార్టీలకు వెళుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఎటువంటి భద్రత ప్రమాణాలు లేకుండా మత్స్యకారులు 24 గంటల పాటు గోదావరిలో నాటుపడవలు నడుపుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు గోదావరి తీరంలో ఉన్న లంక గ్రామాలు అడ్డాగా మారాయి.


రాజమండ్రి పుష్కర ఘాట్‌లో మునిగిపోయిన నాటుపడవను బయటకు తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నీటిలో ఊబిలో నాటుపడవ కూరుకుపోయింది. వారిలో బోటు నడిపే మత్స్యకారుడు కూడా ఉన్నాడు. నాటుపడవలో వారు రాజమండ్రి శివారు సింహాచల్ నగర్, భవానీ పురం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్ ..

అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రకటన చేయనున్న ప్రభుత్వం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 04 , 2025 | 10:11 AM