Minister Lokesh:విశ్రాంతి తీసుకుంటారా.. లేక సస్పెండ్ చేయించమంటారా..
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:47 PM
మంత్రి లోకేష్ మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోగ్యంపై అసెంబ్లీ చర్చించారు. నిమ్మల ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారని ఆయన విశ్రాంతి తీసుకోవడానికి రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును లోకేష్ కోరారు. దీనికి మరో సభ్యుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మద్దతు తెలిపారు.

అమరావతి: ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ( Minister Lokesh) శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu)తో అసెంబ్లీ లాబీ 9Assembly Lobby)లో సంభాషణ జరిపారు. నిమ్మల అనారోగ్యం (health issue)తో బాధపడుతూ సభ (Assembly)కు రావడంతో లోకేష్ మాట్లాడారు. విశ్రాంతి (Rest) తీసుకుంటారా.. లేక సభ నుంచి సస్పెండ్ (Suspend) చేయించమంటారా.. అంటూ రామానాయుడుతో నారా లోకేష్ అన్నారు. ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి పనిచేస్తానంటే ఇక మిమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేయించాల్సిందే అన్నారు. నిన్నటి వరకూ ఒక చేతికి సిలైన్ ఇంజెక్షన్ పెట్టుకుని శుక్రవారం మరో చేతికి పెట్టుకుని తిరుగుతూంటే ఆరోగ్యం ఏం కావాలన్నారు.
Read More News..:
ఎస్ఎల్‌బీసీ..క్యాడవర్ డాగ్స్ ఆపరేషన్.
లోకేష్ వ్యాఖ్యలకు సమాధానంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. నిన్నటి మీద ఆరోగ్యం కొంచెం బాగానే ఉందని.. అందుకే వచ్చానని అన్నారు. విశ్రాంతితో కూడిన ప్రశాంత నిద్రతోనే ఆరోగ్యం కుదుటపడుతుందని లోకేష్ అన్నారు. మాట వినకుంటే తన యాపిల్ వాచ్‌ని ఇక రామానాయుడు చేతికి పెట్టి నిద్రను తాను మానిటర్ చేస్తానని లోకేష్ అన్నారు. తాను పని ఒత్తిడికి గురైనప్పుడు ఓ 15 నిమిషాలు టీవీ చూస్తూ పడుకుంటే తర్వాత ఎంతో రిలాక్స్‌గా ఉంటుందని లోకేష్ అన్నారు. ఈ పద్ధతి ప్రయత్నించి చూడాలని రామానాయుడుకు సూచించారు.
అసెంబ్లీలో మంత్రి రామానాయుడు ఆరోగ్యంపై నారా లోకేష్ ప్రస్తావించారు. కీలక శాఖలో ఉన్న మంత్రి నిమ్మల ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారని మంత్రి లోకేష్ అన్నారు. రామానాయుడు విశ్రాంతి తీసుకోవడానికి రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును లోకేష్ కోరారు. ఆయన ప్రకటనకు మరో సభ్యుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మద్దతు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్
నా భర్త వల్లే బ్రతికి ఉన్నాను: కల్పన
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News