Share News

High Court: విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్

ABN , Publish Date - Mar 07 , 2025 | 11:39 AM

కాకినాడ సెజ్ వ్యవహారంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

 High Court: విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్
Vikrant Reddy

అమరావతి: కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ కాకినాడ సెజ్ (kakinada Sez) వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి (Vikrant Reddy)కి ముందస్తు బెయిల్ (Anticipatory Bail) మంజూరైంది (Granted). కేవీఆర్ గ్రూపు (KVR Group)కు చెందిన వాటాలు అరబిందోకు బదలాయింపు వ్యవహారంలో సీఐడీ పోలీసులు కేసు (CID Police Case) నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై. విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Read More News..:

ఎమ్మెల్యే అరవింద బాబు వీరంగం


కాగా ముందస్తు బెయిల్ కోసం విక్రాంత్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ 6న హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌ వాటాల బదిలీ వ్యవహారంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని సీఐడీ పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌‌లోని వాటాలను బలవంతంగా అరబిందోకు బదలాయించుకున్నారని కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌,కేవీఆర్‌ గ్రూపునకు చెందిన కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 2న మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ కేసులో ఏ-1గా ఉన్న విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాలని, లేదంటే అది నిరర్థకమవుతుందన్నారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి సున్నితంగా తోసిపుచ్చారు.ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు తనపై, తన కుటుంబసభ్యులపై అక్రమ కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని, వ్యాపారాల్ని మూయించేస్తామని బెదిరించి ఆస్తులు రాయించుకున్నారని బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) సీఐడీకి ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో జగన్‌‌కు వరుసకు సోదరుడైన వై.విక్రాంత్‌రెడ్డి, వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థ ప్రతినిధి పి.శరత్‌చంద్రారెడ్డి, పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్‌పీ ఆడిట్‌ సంస్థలు, అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, ఇతరులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా భర్త వల్లే బ్రతికి ఉన్నాను: కల్పన

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 07 , 2025 | 11:39 AM