Share News

Fire accident:జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Mar 07 , 2025 | 09:47 AM

జీడిమెట్ల పారిశ్రామికవాడలోని రాంరెడ్డి నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టుప్రక్కల స్థానికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Fire accident:జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
Fire Accident

హైదరాబాద్: నగరంలోని తరచుగా అగ్ని ప్రమాదాలు (Fire Accidents) జరుగుతున్నాయి. తాజాగా జీడిమెట్ల పారిశ్రామికవాడ (Jeedimetla Industrial Area)లోని రాంరెడ్డి నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. జగన్నాథ్ ఇండస్ట్రీస్ అల్యూమినియం మోడలింగ్ కంపెనీ (Aluminum Modeling Company)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టుప్రక్కల స్థానికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read More..:

ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నాయకులు


మరోవైపు హైదరాబాద్ పాతబస్తీ బహదూరపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బహదూర్‌ పుర క్రాస్ రోడ్డులో స్థానికంగా ఉన్న లారీ మెకానికల్ వర్క్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ధాటికి పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని ప్రమాక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గతంలో కూడా ఇదే లారీ మెకానిక్​ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రన్యారావు కేసులో సంచలన విషయాలు

కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 07 , 2025 | 09:47 AM