ఎమ్మెల్యే అరవింద బాబు వీరంగం
ABN, Publish Date - Mar 07 , 2025 | 10:50 AM
నరసారావుపేట: ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఎక్సైజ్ కమిషనర్ ఛాంబర్‌లో హల్ చల్ చేశారు. ఏకంగా ఆ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ చాంబర్‌కు వెళ్లి హల్ చల్ చేశారు. మద్యం డిపోలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు.
నరసారావుపేట: ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఎక్సైజ్ కమిషనర్ ఛాంబర్‌లో హల్ చల్ చేశారు. ఏకంగా ఆ శాఖ డైరెక్టర్ చాంబర్‌కు వెళ్లి హల్ చల్ చేశారు. మద్యం డిపోలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. నరసారావుపేటలోని ఎక్సైజ్ శాఖలో 11 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో నియమితులయ్యారనే వంకతో వారిలో ఒకరు మినహా మిగిలిన 10 మందిని వెంటనే తొలగించాలని వారి స్థానాల్లో తాను సూచించిన 10 మందిని తక్షణమే ఉద్యోగంలోకి తీసుకోవాలని అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి పట్టుపట్టారు. ఇదే విషయమై తాను రాసిన లేఖపై స్పందన లేదన్న విషయాన్ని డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Read More..:
నా భర్త వల్లే బ్రతికి ఉన్నాను: కల్పన
ఈ వార్తలు కూడా చదవండి..
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నాయకులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Mar 07 , 2025 | 10:50 AM