Share News

Vamsi Arrest Case.. వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో కీలక పరిణామాలు

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:33 PM

గన్నవరం టీడీపీ కార్యాలయం విద్వంసం కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ కిడ్నాప్‌లో కీలక ఆధారాలు పోలీసులు సంపాదించారు. కోర్టు కంప్లెక్ వద్దకు సత్యవర్ధన్‌ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వంశీ అనుచరుల వివరాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్‌ను నగరంలో ఎక్కడెక్కడ తిప్పారనే అంశంపై కూడా సాంకేతిక ఆధారాలు సేకరించారు.

Vamsi Arrest Case.. వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో కీలక పరిణామాలు
Vallabhaneni Vamsi Arrest Case

అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత (YSRCP leader) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi arrest) అరెస్ట్ కేసు (Arrest Case)లో కీలక పరిణామాలు (Key Developments) చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు వంశీ.. ఆయనతో పాటు అరెస్ట్ అయిన మరో ఇరువురిని కస్టడీ (Custody)కు ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు వంశీ తరపున బెయిల్ పిటిషన్ వేసేందుకు ఆయన తరఫు న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ మోహన్ విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. కాగా ఈ కేసులో మరికొందరు కీలక నిందితులు అరెస్ట్ కావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి..

శ్రీశైలం మల్లన్నకు 360 మూరల తలపాగా


కీలక ఆధారాలు సంపాదించిన పోలీసులు..

గన్నవరం టీడీపీ కార్యాలయం విద్వంసం కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ కిడ్నాప్‌లో కీలక ఆధారాలు పోలీసులు సంపాదించారు. కోర్టు కంప్లెక్ వద్దకు సత్యవర్ధన్‌ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వారి వివరాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్‌ను నగరంలో ఎక్కడెక్కడ తిప్పారనే అంశంపై కూడా సాంకేతిక ఆధారాలు సేకరించారు. వంశీ అనుచరులే ఆ రోజు సత్యవర్ధన్‌ను తీసుకువచ్చారని నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండటంతో మిగతా వారి కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గన్నవరం, విజయవాడలో వంశీ అనుచరులపై పోలీసులు డేగ కన్ను వేశారు. కాగా తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఇప్పటికే ప్రకటించారు.


కాగా వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు విజయవాడ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు కిడ్నాప్ కేసుపై 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా కారాగారానికి తరలించారు. జిల్లా కారాగారంలో 14 రోజుల పాటు (ఈనె ల 27 వరకు) రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. రిమాండ్ ఖైదీగా నెంబర్ కేటాయించి అధికారులు జైలు గదిలోకి పంపారు. జైలుకు వచ్చే ముందు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో పోలీసులు వంశీ వేలి ముద్రలు, ఐరీష్ తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు

కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర

ఆ హార్డ్ డిస్క్‌లో 300లకు పైగా నగ్న వీడియోలు..

సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 14 , 2025 | 01:33 PM