Mohan Babu: మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:51 PM
దర్శక, నిర్మాత, సినీనటుడు మంచు మోహన్ బాబు బౌన్సర్లు మరోసారి రెచ్చిపోయారు. తిరుపతిలోని ఆయన విద్యా సంస్థ సమీపంలో ఉన్న రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్నవాళ్లు హోటల్ వద్దకు చేరుకున్నవారిపై కూడా బౌన్సర్లు దాడికి యత్నించారు.

తిరుపతి: నగరంలో మోహన్ బాబు బౌన్సర్లు (Mohan Babu Bouncers) మరోసారి రెచ్చిపోయారు. ఆయన విద్యాసంస్థల దగ్గర ఉన్న ఓ రెస్టారెంట్ (Restaurant )ను బౌన్సర్లు ధ్వంసం (Damage) చేశారు. యూనివర్శిటీకి చెందిన నలుగురు విద్యార్థులు టీ తాగేందుకు హోటల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా బ్యాగ్ తగిలి టీ సాసర్, కప్పులు పగిలిపోయాయి. అయితే డబ్బులు చెల్లిస్తున్న విద్యార్ధులను రెస్టారెంట్ సిబ్బంది దుర్బాషలాడారు. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు విద్యా సంస్థలకు చెందిన బౌన్సర్లు రెస్టారెంట్‌కు వెళ్లి.. యాజమాన్యంతో గొడవపడి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనపై హోటల్ నిర్వాహకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర
ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్నవాళ్లు హోటల్ వద్దకు చేరుకున్నవారిపై కూడా బౌన్సర్లు దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ మరికాసేపట్లు రెస్టారెంట్ వద్దకు రానున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించి.. వారితో మాట్లాడి.. హోటల్ నిర్వాహకులకు ఆర్థికంగా సాయం చేయనున్నట్లు సమాచారం. అలాగే హోటల్ యాజమాన్యానికి ధైర్యం చెప్పి.. వారికి అండగా నిలబడతానని చెప్పే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కాగా ఘటనపై ఇంత వరకు కేసు నమోదు కాకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు..
మరోవైపు రాయచోటిలోని ఓ సినిమా వేడుకలో మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా మంచు విష్ణు కన్నప్ప సినిమాపై మనోజ్ విమర్శలు చేశారు. కోటి రూపాయలుతో తీస్తే సినిమా చిన్న సినిమా కాదని.. రూ. వెయ్యి కోట్లతో తీస్తే అది పెద్ద సినిమా అయిపోదని అన్నారు. సినిమా ఎప్పటికీ సినిమానేనని.. సినిమా చాలా గొప్పదని.. తాను ఎప్పుడూ సినిమాను తన అమ్మతో పోలుస్తానని మంచు మనోజ్ అన్నారు.
తాను న్యాయం కోసం ఎంత దూరమైనా వెళతానని.. బయట వారైనాసరే.. ఇంటి వారైనా సరే అంటూ మంచు మనోజ్ కామెంట్స్ చేశారు. తనను తొక్కేయాలని చాలా మంది ప్రయత్నించారని.. చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వ్యక్తిని కాదని.. నన్ను తొక్కలన్నా పైకి లేపాలన్న ప్రేక్షకుల చేతుల్లోనే ఉందని.. ఇంక ఎవరివల్ల సాధ్యం కాదని అన్నారు. కాగా మోహన్ బాబుతో వివాదం నేపథ్యంలో మనోజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ హార్డ్ డిస్క్‌లో 300లకు పైగా నగ్న వీడియోలు..
సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం
వల్లభనేని వంశీ నొటోరియస్ క్రిమినల్
బర్డ్ ఫ్లూ.. 5 వేల 500 కోళ్లు మృతి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News