Masthan Sai.. ఆ హార్డ్ డిస్క్‌లో 300లకు పైగా నగ్న వీడియోలు..
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:14 AM
రిమాండ్ ఖైదీగా ఉన్న మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు రెండో రోజు శుక్రవారం విచారిస్తున్నారు. మస్తాన్ సాయికి చెందిన హార్డ్ డిస్క్‌ను ఓపెన్ చేసి, అందులో వివరాలు సేకరించనున్నారు. హార్డ్ డిస్క్‌లో ఏముంది. లావణ్య చెప్పినట్లు అశ్లీల రికార్డింగులు ఉన్నాయా.. మొత్తం ఎన్ని వీడియోలు ఉన్నాయి.. అన్న విషయంపై పోలీసులు ఆరా తీయనున్నారు.

హైదరాబాద్: జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మస్తాన్ సాయిని (Masthan Sai) నార్సింగి పోలీసులు (Narsingi Police ) రెండో రోజు శుక్రవారం విచారిస్తున్నారు (Investigation). నగ్న వీడియోల కేసు (Nude Videos Case)లో మస్తాన్ సాయిపై లావణ్య (Lavanya) ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మస్తాన్ సాయిపై సైబర్ నేరం, లైంగిక దాడి, బ్లాక్ మెయిలింగ్ కేసులు పెట్టారు. నగ్న వీడియోలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను లావణ్య నార్సింగి పోలీసులకు ఇచ్చింది. ఆ హార్డ్ డిస్క్‌లో 300లకు పైగా నగ్న వీడియోలు ఉన్నాయనీ లావణ్య పిర్యాదు చేసింది. ఈ క్రమంలో హార్డ్ డిస్క్, నగ్న వీడియోలపై మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు విచారించనున్నారు. మరో వైపు మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీలు జరిగిన నేపథ్యంలో ఆ డ్రగ్స్ ఎక్కడ నుండి వచ్చాయి.. ఎవరు సప్లై చేశారు.. తదితర అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. కాగా శనివారంతో మస్తాన్ సాయి పోలీస్ కస్టడీ ముగియనుంది.
ఈ వార్త కూడా చదవండి..
బర్డ్ ఫ్లూ.. 5 వేల 500 కోళ్లు మృతి..
కాగా మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. సైబర్ క్రైం, లైంగిక దాడి, బ్లాక్‌మెయిలింగ్ వంటి కేసులో మస్తాన్ సాయిని పోలీసులు ఈనెల 3న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు మస్తాన్ సాయికి చెందిన హార్డ్ డిస్క్‌ను ఓపెన్ చేసి, అందులో వివరాలు సేకరించనున్నారు. హార్డ్ డిస్క్‌లో ఏముంది. లావణ్య చెప్పినట్లు అశ్లీల రికార్డింగులు ఉన్నాయా.. మొత్తం ఎన్ని వీడియోలు ఉన్నాయి.. అన్న విషయంపై పోలీసులు ఆరా తీయనున్నారు. అయితే మస్తాన్ సాయి పోలీసులతో సానుకూలంగానే ఉన్నట్లు, అన్ని వివరాలను వెళ్లడించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. విచారణ అనం తరం నివేదికను కోర్టుకు సమర్పిస్తామని నార్సింగ్ పోలీసులు తెలిపారు.
కోర్టులో తేల్చుకుంటా: లావణ్య..
పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత లావణ్య కోకాపేట్‌లోని తన నివాసంలో కొంత మంది మీడియా ప్రతినిధులతో మీడియా సమావేశం నిర్వహించారు. పోలీసుల విచారణలో చాలా విషయాలు వెలుగు చూస్తాయన్నారు. ఆ తర్వాత ఆయా విషయాలపై తాను కోర్టుకు వెళ్లి తేల్చుకుంటానని చెప్పారు. రాజ్ తరుణ్ కుటుంబానికి ఆమె ఈ సందర్భంగా క్షమాపణ తెలిపారు. తాను ఇంకోసారి. మీడియా ముందుకు రానని. ఏ విషయమైనా కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు. సెప్టెంబర్‌లో డీఐతో ఓ కేసు విషయం మాట్లాడాలని.. అయితే, ఈ డీఐ అంశంలో తన అనుమతిలేకుండా చాలామంది వీడియోలు, వాయిస్ రికార్డులు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం
వల్లభనేని వంశీ నొటోరియస్ క్రిమినల్
ఏపీలో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News