Indhra Keeladri:భవానీ దీక్ష విరమణల షెడ్యూల్ ప్రకటించిన ఇంద్రకీలాద్రి దేవస్థానం
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:13 PM
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 2026 నూతన క్యాలెండర్‌ని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ఇవాళ(గురువారం) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవానీ దీక్షా విరమణల షెడ్యూల్ విడుదల చేశారు.
విజయవాడ, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (Vijayawada Indhra Keeladri Kanaka Durgamma Devasthanam) 2026 నూతన క్యాలెండర్‌ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ఇవాళ(గురువారం) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవానీ దీక్షా విరమణల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీన గాజుల అలంకారంలో దర్శనమివ్వనున్నారు దుర్గమ్మ. ఈ నేపథ్యంలో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 19వ తేదీన ధన త్రయోదశి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి యాగం, 20వ తేదీన దీపావళి సందర్భంగా శ్రీ ధనలక్ష్మీ పూజ, దీపాలంకరణ, బాణాసంచా వెలిగించడం అనంతరం రాత్రి 7 గంటల నుంచి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నీ కవాట బంధనం చేస్తున్నట్లు వివరించారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
నవంబర్ 1వ తేదీ నుంచి దుర్గమ్మ మండల దీక్షాధారణలు ప్రారంభం అవుతాయని తెలిపారు. నవంబర్ 21వ తేదీ నుంచి దుర్గమ్మ అర్ధమండల దీక్షా ధారణలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. డిసెంబర్ 4న కలశజ్యోతి ఉత్సవం, డిసెంబర్11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణలు ఉంటాయని వివరించారు. ఐదురోజుల పాటు భవానీ దీక్షా విరమణలు జరుగనున్నాయని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 15వ తేదీన ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతి, భవానీ దీక్ష విరమణలు ముగింపు ఉంటుందని తెలిపారు. భవానీ దీక్షా విరమణల సందర్భంగా డిసెంబరు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేవస్థానంలో జరిగే అన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan On GST Meeting: ప్రధాని మోదీని కర్మయోగిగా చూస్తాం: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News