Road Accident on AP: ఏపీలో మరో రోడ్డు ప్రమాదం.. 13 మందికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 09:50 PM
మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో- బైక్ ఢీకొని 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కృష్ణాజిల్లా (మచిలీపట్నం), అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం (Machilipatnam)లోని మంగినపూడి బీచ్ రోడ్డు (Manginapudi Beach Road)లో ఇవాళ(శుక్రవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో- బైక్ ఢీకొని 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు మచిలీపట్నం తాలుకా పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
పోతేపల్లి జ్యూయలరీ పార్కు నుంచి మహిళలతో వెళ్తున్న ఆటోను కొత్తపూడి వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం అత్యంత వేగంతో ఢీకొట్టింది. ఆటోలో ఉన్న 11 మందికి తీవ్రగాయాలు, బైక్‌పై ఉన్న ఇద్దరికీ కాళ్లు, చేతులు విరిగాయి. క్షతగాత్రులను హుటాహుటినా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు మచిలీపట్నం తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం.. బైకర్ తల్లి చెప్పిన విషయాలివే..
బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్
Read Latest AP News And Telugu News