Share News

Minister Nadendla Manohar on New Ration Cards: భారీ శుభవార్త.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:04 PM

ఈ నెల 25వ తేదీనుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈనెల 25వ తేదీన 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు. వచ్చెనెల 15 తేదీ వరకు నాలుగు విడతల్లో పండుగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Minister Nadendla Manohar on New Ration Cards: భారీ శుభవార్త.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
AP Minister Nadendla Manohar

విజయవాడ, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): టెక్నాలజీ వినియోగంతో పారదర్శకతతో సంక్షేమం అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (AP Minister Nadendla Manohar) వ్యాఖ్యానించారు. సుపరిపాలనలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చామని ఉద్ఘాటించారు. ఈ నెల 25వ తేదీ నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇవాళ( శుక్రవారం) విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.


ఈనెల 25వ తేదీన 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వచ్చెనెల 15 తేదీ వరకు నాలుగు విడతల్లో పండుగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పండుగ వాతావరణంలో కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. 1.45కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రైస్ కార్డులను ఉచితంగా ఇంటింటికీ వెళ్లి అందజేస్తామని తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 6.70లక్షల కార్డుదారులకీ స్మార్ట్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. క్యూఆర్ కోడ్‌తో సహా ... పలు సాంకేతిక అంశాలతో స్మార్ట్ కార్డులు తయారు చేశామని పేర్కొన్నారు. మండలాల వారీగా స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తైందని చెప్పుకొచ్చారు. స్మార్ట్ రైస్ కార్డుతో స్వైప్ చేసి సరుకులు పొందవచ్చని సూచించారు. సరుకుల పంపిణీ సమాచారాన్ని ఎప్పటి కప్పుడు కేంద్ర సర్వర్‌కు చేరవేస్తుందని వివరించారు మంత్రి నాదెండ్ల మనోహర్.


ప్రస్తుతం వృద్ధులు, వికలాంగులకు 16.70లక్షల మందికి సరుకులను డోర్ డెలివరీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పర్యవేక్షణలో లోపం లేకుండా పకడ్బందీగా కార్డులు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ వారు ఎక్కడినుంచైనా రేషన్ తీసుకోవచ్చని సూచించారు. స్మార్ట్ కార్డుల రాకతో డీలర్ల అక్రమాలకు చెక్ పడుతుందని చెప్పుకొచ్చారు. స్మార్ట్ కార్డులతో పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా సమర్థవంతంగా పర్యవేక్షణ జరుగుతుందని వెల్లడించారు. మార్కెట్ ధరలు పెరిగినప్పుడు తప్పకుండా పౌర సరఫరాల ద్వారా అదనపు సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2025 | 05:12 PM