AP High Court on Temple Land: ఆలయ భూముల రక్షణపై హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 04:41 PM
విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌పై న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది.
అమరావతి,సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి (Venkateswara Swamy temple) సంబంధించిన దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav) నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court)లో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌పై న్యాయస్థానం ఇవాళ (మంగళవారం) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించింది హైకోర్టు. ఆ భూములోకి తరలించిన గ్రావెల్, మట్టి, కంకరను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఆ భూములను యథాస్థితికి తీసుకురావాలని ఆదేశించింది న్యాయస్థానం. అయితే ఈ భూములను ఇప్పటికే 56రోజుల లీజుకు ఇచ్చింది దేవాదాయశాఖ. ఈ లీజు మొత్తాన్ని గొడుగుపేట దేవస్థానానికి చెల్లించారు విజయవాడ ఉత్సవ్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు.
ఈ వార్తలు కూడా చదవండి
రెవెన్యూలో టెక్నాలజీ సమగ్రంగా అమలు చేయండి: సీఎం చంద్రబాబు
జగన్ అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం..మంత్రి ఆనం స్ట్రాంగ్ సవాల్
Read Latest Andhra Pradesh News and National News