Share News

ACB RaidS: ఏపీలో ఏసీబీ సోదాలు.. ఆ శాఖపై అధికారుల ఫోకస్

ABN , Publish Date - Dec 23 , 2025 | 02:32 PM

అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడంతో ఏసీబీ సోదాలపై స్పెషల్ ఫోకస్‌ పెట్టింది.

ACB RaidS: ఏపీలో ఏసీబీ సోదాలు.. ఆ శాఖపై అధికారుల ఫోకస్
ACB RaidS

అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh Govt) చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏసీబీ (ACB) (యాంటీ కరప్షన్ బ్యూరో) అధికారులు ఇవాళ (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులపై అక్రమ సంపాదన ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది.


ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్‌, సత్యసాయి జిల్లాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల నివాసాల్లో ఈ సోదాలు కొనసాగాయి. సోదాల సమయంలో కీలక ఫైళ్లు, కంప్యూటర్ డేటా, లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం.


విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన రామకృష్ణతో పాటు సహ ఉద్యోగులు, మరో ప్రైవేట్ ఉద్యోగి నివాసాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. విశాఖలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. పెందుర్తి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఉద్యోగుల ఇళ్లలో.. ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు.


సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరులో తనిఖీలు నిర్వహించారు. భూముల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, డాక్యుమెంట్ల నమోదు విషయంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ రైడ్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఏసీబీ సోదాలతో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే అధికారుల్లో భయం నెలకొంది.


ఇవి కూడా చదవండి...

వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?

ఏపీలో మళ్లీ అదే సక్సెస్ ఫార్ములా.. క్వాంటం, ఏఐపై సీబీఎన్ ప్లాన్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 02:45 PM