Share News

AP Pensions: 15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ABN , Publish Date - Aug 22 , 2025 | 01:11 PM

కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి లక్షలమంది అర్హులకు పెన్షన్ తొలగించిందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు.

AP Pensions: 15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Kondapalli Srinivas Pension Statement

అమరావతి: ప్రభుత్వం అర్హుల పెన్షన్లు తొలగిస్తోందని గత కొన్ని రోజులుగా గగ్గోలు పెడుతున్న వైసీపీ పార్టీ నేతల ఆరోపణలపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవాలేనని కొట్టిపడేస్తూ పెన్షన్ల విషయంలో ప్రభుత్వ విధివిధానాలపై క్లారిటీ ఇచ్చారు. కూటమి అధికారం చేపట్టి 15 నెలలు కావొస్తోందని.. ఈ వ్యవధిలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం 65 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా 4 లక్షల 50 వేలు పెన్షన్లను తొలగించారంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోందని.. దమ్ముంటే ఆధారాలు ఇవ్వాలని సవాల్ విసిరారు.


మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేదరికం నుంచి ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం పెన్షన్ ఇస్తోందని అన్నారు. వృద్ధాప్య పెన్షన్‌ తీసుకుంటున్న చాలామంది సంతృప్తిగా, ఆనందంగా ఉన్నారని తెలిపారు. భర్త చనిపోతే భార్యకు కూడా పెన్షన్ ఇస్తున్నామని.. కానీ, అనర్హులకు పెన్షన్లు రావని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నకిలీ సర్టిఫికేట్లతో దివ్యాంగుల పెన్షన్ కోసం చాలామంది నమోదు చేసుకున్నారని.. అందుకే 80 వేల మందికి నోటీస్ ఇచ్చామని అన్నారు. తగిన సర్టిఫికెట్ చూపిస్తే తిరిగి పెన్షన్ వస్తుందని స్పష్టం చేశారు. అర్హులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం ఉద్దేశమని వెల్లడించారు.


9 నెలల నుంచి పెన్షన్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతోందని..7 లక్షల 95 వేల మంది పెన్షన్ వెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయినట్లు మంత్రి కొండపల్లి పేర్కొన్నారు. హెల్త్ పెన్షన్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ అధికారులు తనిఖీ చేస్తారని చెప్పారు. 20 వేల మంది డిసేబుల్‌ లిస్టులో పడిపోయారని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ వృద్ధాప్య పెన్షన్‌లోకి కన్వర్ట్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ అదుపులో వైసీపీ మాజీ మంత్రి!

ఆ మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలపండి

For More AP News

Updated Date - Aug 22 , 2025 | 01:43 PM