Share News

Tungabhadra River: శాంతించిన తుంగభద్రమ్మ

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:39 PM

రెండు, మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన తుంగభద్ర శుక్రవారం కాస్త శాంతించింది. జలాశయం నుంచి నదికి నీరు విడుదల తక్కువ కావడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Tungabhadra River: శాంతించిన తుంగభద్రమ్మ

కంప్లి(కర్ణాటక): రెండు, మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన తుంగభద్ర(Tungabhadra) శనివారం కాస్త శాంతించింది. జలాశయం నుంచి నదికి నీరు విడుదల తక్కువ కావడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కంప్లి కోట వద్ద బ్రిడ్జిని తాకుతున్న నీరు తగ్గుముఖం పట్టింది. కోట వద్ద ఆంజనేయస్వామి(Anjaneya Swamy) దేవస్థానంలో నీరు తగ్గుముఖం పట్టింది.


pandu1.2.jpg

నదికి ఎక్కువగా నీరు పోటెత్తడంతో మత్స్యకారులు తెప్పలను గట్టుకు చేర్చారు. ఈ యేడాది గత మూడు నాలుగు సార్లు నదికి నీరు పోటెత్తడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లాలన్నా తెప్పలపైన వెళ్లవలసిన అవసరం ఏర్పడింది. మొత్తానికి జలాశయంపై భాగంలో వర్షాలు తక్కువ కావడంతో నదికి నీరు కూ డా వరద తక్కువైంది. కంప్లి వంతెనపై ఇంకా వాహనాలను అనుమ తించడంలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

శాంతిస్తున్న ఉగ్ర గోదావరి

ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 22 , 2025 | 12:39 PM