AP News: ధర్మవరంలో మెకానిక్ దారుణహత్య
ABN , Publish Date - Aug 22 , 2025 | 01:05 PM
పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లోని రైల్వే ఫ్లైఓవర్ కింద గురువారం తెల్లవారుజామున మెకానిక్ ధనుంజయ(26)ను తలపై సిమెంటు ఇటుకతో బాది దారుణంగా హత్య చేశారు. వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కేతిరెడ్డికాలనీకి చెందిన ధనుంజయ మెకానిక్.
ధర్మవరం(అనంతపురం): పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లోని రైల్వే ఫ్లైఓవర్ కింద గురువారం తెల్లవారుజామున మెకానిక్ ధనుంజయ(26)ను తలపై సిమెంటు ఇటుకతో బాది దారుణంగా హత్య చేశారు. వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కేతిరెడ్డికాలనీకి చెందిన ధనుంజయ మెకానిక్. అతడికి భార్య శృతి, కుమారుడు నందవర్దన్, కుమార్తె మధుశ్రీ ఉన్నారు. కొంతకాలం క్రితం ధనుంజయతో గొడవపడి భార్య పుట్టినిల్లు బళ్లారికి వెళ్లింది.

ఈ నేపథ్యంలో ధనుంజయను గుర్తుతెలియనివారు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో సీఐ నాగేంద్రప్రసాద్.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ధనుంజయ తల్లి లక్ష్మీనారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..
Read Latest Telangana News and National News