Kadapa Industrial Hub: కడప జిల్లా అభివృద్ధిలో మంత్రి లోకేష్ మార్క్.. జిల్లాకు మరో భారీ పరిశ్రమ
ABN , Publish Date - Aug 29 , 2025 | 07:29 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతో కొప్పర్తికి మహర్దశ పడుతోంది. జగన్ హయాంలో కనీసం సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోలేదు.. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కడప అభివృద్ధిలో తన మార్కు చూపించారు.
కొప్పర్తికి పరిశ్రమల కళ
కడప వైపు కంపెనీల చూపు
ఉత్పత్తికి రెండు పరిశ్రమలు సిద్ధం
2,400 మందికి ఉపాధి
2న మంత్రి నారా లోకేశ్ ప్రారంభం
(కడప-ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతో కొప్పర్తికి మహర్దశ పడుతోంది. జగన్ (Jagan) హయాంలో కనీసం సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోలేదు.. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కడప అభివృద్ధిలో తన మార్కు చూపించారు. జగన్ తానే 30 ఏళ్ల పాటు సీఎం అని చెప్పుకున్నారే కానీ.. సొంత జిల్లా అభివృద్ధిపై తన మార్కు చూపించ లేదు. అందుకే జనం కూడా ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పుడు కడప జిల్లా అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉంది. అయితే ఇక్కడ రాజకీయ నాయకులకు పర్సంటేజీలు, కంపెనీలలో బలవంతపు వాటా ఇచ్చే అవసరం లేకపోతే పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటవుతాయి. వైసీపీ (YSRCP) హయాంలో కొప్పర్తిలో పరిశ్రమలు (Kopparthy Industries) ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్యం అడిగే వారని ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదే ధోరణి కొనసాగుతోందని సమాచారం. దీంతో ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ఇప్పుడు చంద్రబాబు సర్కారు పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చేందుకు రాయితీలు ఇస్తోంది. కడప జిల్లా రాజకీయాలపై సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్‌కు (Nara Lokesh) అవగాహన ఉంది. అందుకే పరిశ్రమల స్థాపనలో వేలు పెడితే తాటతీస్తామన్న విధంగా నేతలను హెచ్చరించారు. దీంతో ఇప్పుడు పలు పరిశ్రమలు కడప వైపు చూస్తున్నాయి. జిల్లాకు మాత్రమే కాదు రాష్ట్రానికే మణిహారంగా ఉన్న కొప్పర్తి పారిశ్రామికవాడలో ప్రత్యక్షంగా 2,400 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమపుతున్నాయి.
2వ తేదీన నారా లోకేశ్ రాక
పరిశ్రమల ఏర్పాటుతో కొప్పర్తికి కళ సంతరించుకుంటోంది. సుమారు రూ.50కోట్ల వ్యయంతో టెక్స్‌నో ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ద్వారా 'దుస్తుల తయారీ, సూటు, ఇతరత్రా తయారుకానున్నాయి. రూ.120 కోట్లతో టెక్నోడోమ్ (Technodome) ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ ప్రారంభించనున్నారు. దీంట్లో ఎస్ఈడీ టీవీలు, మల్టీమీడియా స్పీకర్లు ఇతర ఆడియోకు సంబంధించిన విబాగా లన్నీ ఇక్కడ తయారవుతాయి. 300 మందికి ఉపాధి కల్పిస్తుంది. వీటన్నింటినీ మంత్రి లోకేశ్ చేతుల మీదుగా సెప్టెంబర్ 2వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొప్పర్తి హబ్
కడప నగర శివారులోని కొప్పర్తి పారిశ్రామిక వాడలో 600 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హజ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో అన్ని ఉండటంతో కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు వస్తున్నారు. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలకు భూములు కేటాయించారు. కొందరు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ జగన్ చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదు..
ఏపీ ప్రభుత్వ స్టీల్‌ను దోచిన ఘనులు.. భారీ స్కాం వెలుగులోకి...
For More AndhraPradesh News And Telugu News