Share News

Benefits of Okra Cultivation: అన్నదాతలకు సిరులు కురిపిస్తున్న బెండ

ABN , Publish Date - Sep 05 , 2025 | 10:56 AM

ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాకాలు పంట కింద సాగు చేసిన బెండ అన్నదాతలకు సిరులు కురిపిస్తోంది. ఆశించిన దిగుబడులతో పాటు, మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుంటడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. సిద్ధవటం మండలంలోని ఖాజీపల్లి టక్కోలి, కాకిపల్లె, డేగలవాండ్లపల్లె, పాత టక్కొలు, మంగళవాండ్లపల్లె, కడపాయల్లి, లింగంపల్లె, మాచుపల్లె, తురకపల్లె, మూలవల్లె తదితర గ్రామాలు కూరగాయల పంటల సాగుకు ప్రసిద్ది. పలు రకాల కూరగాయలను ఇక్కడి రైతులు పండిస్తుంటారు.

Benefits of Okra Cultivation: అన్నదాతలకు సిరులు కురిపిస్తున్న బెండ
Benefits of Okra Cultivation

కడప రూరల్, సెప్టెంబర్4 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాకాలు పంట కింద సాగు చేసిన బెండ అన్నదాతలకు సిరులు కురిపిస్తోంది. ఆశించిన దిగుబడులతో పాటు, మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుంటడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. సిద్ధవటం మండలంలోని ఖాజీపల్లి టక్కోలి, కాకిపల్లె, డేగలవాండ్లపల్లె, పాత టక్కొలు, మంగళవాండ్లపల్లె, కడపాయల్లి, లింగంపల్లె, మాచుపల్లె, తురకపల్లె, మూలవల్లె తదితర గ్రామాలు కూరగాయల పంటల సాగుకు ప్రసిద్ది. పలు రకాల కూరగాయలను ఇక్కడి రైతులు పండిస్తుంటారు. ఈ ఏడాది పై గ్రామా రైతులు దాదాపు 100 ఎకరాల వరకు బెండ పంటను సాగుచేశారు. ఎకరాకు 4 నుంచి కిలోలు వరకు విత్తనం వాడారు. విత్తనశుద్ధితో పాటు, ఎరువులు, పురుగుమందుల వాడకంతో పాటు సకాలంలో సస్యరక్షణ చర్యలను చేపట్టారు. దీంతో ప్రస్తుతం వంట ఆశించిన దిగుబడులను అందిస్తోంది. మార్కెట్‌లో మంచి ధర పలుకడంతో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు.


రాబడి ఇలా...

బెండ పంట సాగు చేశాక ప్రకృతి అనుకూలించడం, పురుగులు, తెగుళ్లు లేకపోవడంతో అన్నదాతల శ్రమ ఫలించింది. వంట ఆశాజనకంగా ఉంది. ధరలు కూడా బాగున్నాయి. మార్కెట్‌లో కేజీ బెండ ధర రూ.20 నుంచి రూ.40ల వరకు పలుకుతోంది. సరాసరి రూ.20లు చొప్పున ధరలు లభిస్తున్నాయి. ఎకరాకు 5 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ మేరకు ప్రతి రోజు 1500 వరకు కాయలను తెంపుతున్నారు. రైతులే. నేరుగా సగటున కేజీ రూ. 15ల చొప్పన కడప బజారుతో పాటు, పెద్ద మార్కెట్‌లో హౌల్‌సేల్‌గా అమ్ముతున్నారు.


ఇలా ప్రతి రోజు 150 కేజీలకు రూ.3000 వరకు రైతుకు వస్తుండగా ఇందులో కోత, రవాణా ఖర్చుల కింద రూ.700 పోను రూ.2300 వరకు రైతుకు దక్కుతోంది. దాదాపు రెండు నెలల వరకు పంట కోతలు జరుగుతూనే ఉంటాయి. ఇలా ఎకరాకు రూ.1,80,000లకు పైగా ఆదాయం వస్తోంది. ఎకరాకు సాగు ఖర్చులు రూ.50,000 పోగా 1 ,20, 0000 వరకు ఆదాయం మిగిలే అవకాశాలు ఉన్నాయి.


అందుబాటులో మార్కెట్ సౌకర్యం

బెండ పంట సాగు చేసిన గ్రామాలు కడపకు సమీపంలో ఉన్నాయి. దీంతో పొలాల్లో బెండకాయలను కోశాక రైతులు బస్తాలకు నింపి ఆటోల ద్వారా నిత్యం కడవ మార్కెట్ యార్డుతో పాటు పెద్దమార్కెట్‌కు తరలిస్తున్నారు. మార్కెట్లో ఏ రోజు ధర ఆ రోజే రైతుకు దక్కుతోంది. కొందరు రైతులు నేరుగా వారి ఉత్పత్తులను అమ్ముకుంటూ మరింత లాభాలను గడిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 05 , 2025 | 10:57 AM