Share News

YSRCP: డిఫెన్స్‌లో వైసీపీ అధినాయకత్వం.. ఎందుకంటే..

ABN , Publish Date - Jun 22 , 2025 | 07:08 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ నెల 18వ తేదీన పర్యటించారు. వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా ఫ్యాన్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు.

YSRCP: డిఫెన్స్‌లో వైసీపీ అధినాయకత్వం.. ఎందుకంటే..
YSRCP Leadership

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ నెల 18వ తేదీన పర్యటించారు. వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా ఫ్యాన్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఈ సమయంలో జగన్ కారు కిందపడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతిచెందాడు. ఈ ఘటనతో వైసీపీ అధినాయకత్వం డిఫెన్స్‌లో పడింది. డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ఎలా తీసుకోవాలో తెలియక దిక్కు తోచని స్థితిలో వైసీపీ అధినాయకత్వం ఉంది. ఫేక్ ప్రచారం చేసినా జనం నమ్మరనే నిర్ధారణకు వైసీపీ సీనియర్ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.


అయితే ఈ ఘటనపై ఫ్యాన్ పార్టీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పేర్ని నాని, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాసరావు తదితర నేతలు స్పందించలేదు. కార్యకర్తల్లో పార్టీ అధినేత జగన్‌పై నెగిటివ్ ప్రభావం పడిందనే భావనలో ఆ పార్టీ సీనియర్లు ఉన్నారు. రప్పా రప్పా కామెంట్లను కూడా జగన్ సమర్ధించడంపైనా సీనియర్ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. పార్టీని నడిపే విధానం ఇది కాదంటూ ఇంటర్నల్ చర్చల్లో వైసీపీ సీనియర్లు వాపోతున్నారు. జరుగుతున్న పరిణామాలతో పాటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న కామెంట్లు పార్టీని మరింత డ్యామేజ్‌ని చేస్తున్నాయని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి గుండా, రౌడీ పార్టీ ఇమేజ్ వస్తోందంటూ ఫ్యాన్ పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గంజాయి తనిఖీలకు వెళ్లి.. కానిస్టేబుల్ మృతి

డిప్యూటీ సీఎంపై అనుచిత పోస్టులు..

విశాఖ యోగాకు గిన్నిస్ బుక్‌లో స్థానం

For More AP News and Telugu News

Updated Date - Jun 22 , 2025 | 07:29 PM