Posani Krishnamurali: పోసానికి బెయిల్.. జైలు నుంచి విడుదలపై సస్పెన్స్
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:34 PM
Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. కానీ పోసాని విడుదలకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై పోసానిని ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. మంగళవారం పోసానికి కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.

కర్నూలు : సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విడుదలపై సస్పెన్స్ నెలకొంది. న్యాయాధికారి ఎదుట పోసానిని సీఐడీ అధికారులు ఇవాళ(బుధవారం) హాజరు పరిచారు. వర్చువల్ విధానంలో జైలు నుంచి జరుగుతున్న వాదనలు వినిపించారు. న్యాయాధికారి రిమాండ్ విధిస్తే పోసాని కృష్ణమురళి బెయిల్‌పై విడుదల చేయడం ఆగిపోనుంది. రిమాండ్ విధించక పోతే పోసాని విడుదల అయ్యే అవకాశం ఉంది.
పలు జిల్లాల్లో కేసులు నమోదు కావడంతో..బెయిల్‌పై విడుదలైనా మళ్లీ ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పీటీ వారెంట్‌పై పోసాని కృష్ణమురళిని తీసుకెళ్లే అవకాశం ఉంది. మరోవైపు పోసాని విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని నిన్న(మంగళవారం) కోర్టులో నరసరావుపేట పోలీసులు పిటీషన్ వేశారు. ఇవాళ దీనిపై తీర్పు వెలువడనుంది. ఆదోనిలో నమోదైన కేసులో ఈ నెల 4 నుంచి కర్నూలు జిల్లా జైల్లో పోసాని ఉన్నారు. నిన్ననే బెయిల్‌ను కర్నూలు జెఎఫ్‌సీఎం న్యాయాధికారి అపర్ణ మంజూరు చేశారు ఈ లోపే పోసానికి గుంటూరు సీఐడీ అధికారులు షాక్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
High Court: చట్టం కంటే పోలీసులు ఎక్కువేమీ కాదు
AP Police: పోసానిని కస్టడీకి ఇవ్వండి
Minister Achenna Naidu: పీఎం కిసాన్‌తోపాటే అన్నదాత సుఖీభవ
Read Latest AP News and Telugu News